కరోనా సెకండ్ వేవ్ ఉద్రిక్తత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వివిధ లక్షణాలతో వైరస్ బారిన పడుతున్నారు. వైరస్ కూడా పలు రూపాలలోకి మారుతోంది. దీనివల్ల త్వరగా దీన్ని గుర్తించలేక ఎన్నో సమస్యలు వస్తున్నాయి. సాధారణంగా కరోనా అయితే పొడిదగ్గు,నీరసం,వాసన కోల్పోవటం వంటి లక్షణాలు ఉంటాయని చెబుతుంటారు. అయితే ఇటీవల ఛాతీనొప్పి కూడా కోవిడ్ లక్షణమేనని వైద్యులు ధ్రువీకరించారు. దీనిని కొంతమంది వ్యక్తులను పరీక్షించడం ద్వారా తెలుసుకున్నారు. కొద్దిపాటి ఛాతీ నొప్పి వచ్చినా కూడా వైరస్ లక్షణమేనని నిర్ధారించారు. కానీ కొన్ని కారణాల వల్ల కరోనా వైరస్ నొప్పికి దారి తీస్తుంది.
1). పొడి దగ్గు:
కరోనా వైరస్ సోకిన వ్యక్తులకు పొడి దగ్గు విపరీతంగా వస్తుంది. దీనివల్ల పక్కటెముకలు కూడా చాలా నొప్పి గా ఉంటాయి. శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది.
2). నిమోనియా:
నిమోనియా కూడా కోవిడ్ లక్షణంగా నిర్ధారణ అయింది. దీనివల్ల లంగ్స్ లో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఫలితంగా ఛాతిలో నొప్పి వస్తుంది.
3). లంగ్స్ ఇన్ఫెక్షన్:
లంగ్స్ లో కొద్దిపాటి మంట వచ్చినా అది ఛాతీ నొప్పికి దారి తీస్తుంది. తద్వారా రోగులు ఛాతీ నొప్పితో ఎంతో బాధపడుతుంటారు. దీని బారిన పడ్డవారు సిటీ స్కాన్, ఎక్స్రే తీసిన తర్వాత పరిస్థితిని చూసి చికిత్స చేయించుకోవాలి.
4). రక్త నాళాల ద్వారా వైరస్ వ్యాప్తి:
గడ్డకట్టుకుపోయిన రక్తం విడిపోయి ఊపిరితిత్తుల ద్వారా పల్మనరీ ఏంబాలిజానికి వ్యాపిస్తుంది. దీని ఫలితంగా ఛాతీ నొప్పి ఏర్పడుతుంది. కాలేయానికి రక్తసరఫరా నిలిపి వేయబడుతుంది . ఇదంతా కరోనా వైరస్ వల్ల జరుగుతుందని వైద్య నిపుణులు గుర్తించారు. దీని వల్ల కాలేయం లో విపరీతమైన నొప్పి వస్తుంది.
ఇలాంటి లక్షణాలు ఉన్నా సరే కరోనా అని గుర్తించాలి. మీలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే ఆలస్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించాలి. తద్వారా వైరస్ నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి