కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా ఈ పేరు మాత్రమే వినిపిస్తోంది. ఇందుకు కారణం వైరస్ ప్రపంచదేశాల ప్రజలందరినీ భయపెడుతోంది కాబట్టి.. అయితే ఎవరిలో అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, అలాంటి వారిని తొందరగా తనతోపాటు తీసుకెళ్లిపోతుంది.. ఇక ప్రస్తుతం ఈ వైరస్ కారణంగా శవాలు కుప్పలు తెప్పలుగా పడుతున్న రోజులను చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడున్న పరిస్థితి వర్ణనాతీతం. ఎంతోమంది తల్లులు పిల్లలు లేక ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులకు లేక ఇలా ఎంతోమంది ఆప్యాయత, అనురాగాలు దూరమవుతూ ఒంటరి గా మిగిలిపోతున్నారు. అంతేకాకుండా ఎంతో మంది నిరాశ్రయులు అవుతున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పట్లో చాలావరకు ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఇక ఈ ఆక్సిజన్ కొరతతో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారిలో ఈ ఆక్సిజన్ సమస్య ఏర్పడుతోంది. ఆస్తమా ఉన్నవారికి ఊపిరితిత్తుల ద్వారా ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారికి ఈ కరోనా సంభవించినప్పుడు తప్పక ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఇక ఆక్సిజన్ సమయానికి అందించలేని యెడల వారు ఏకంగా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఆస్తమాతో బాధపడేవారు ఇప్పుడు చెప్పబోయే ఒక చక్కని టీ చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది..
ఆ టీ ఏదో కాదు యాలకుల టీ. యాలకులు ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో ఏర్పడే సమస్యలను దూరం చేస్తాయి. ఇప్పుడున్న కరోనా కాలంలో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చేరకుండా వుండాలంటే యాలకుల టీ అలాగే రోజుకు కొన్ని యాలకులు మన రోజూ వారి డైట్ లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. యాలకులను టీ రూపంలో తీసుకోవచ్చు.
అయితే కేవలం రోజుకి ఒకటి నుంచి రెండు సార్లు మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకుంటే,యాలకుల ద్వారా ఊపిరితిత్తుల్లో ఏర్పడే ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు.
యాలకులలో యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. దీని కారణంగా ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియా చేరకుండా ఉంచడంతో పాటు ఆస్తమా పేషెంట్స్ కి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే యాలకుల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించే గుణాలు ఉన్నాయి. కాలుష్యం నుండి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. బ్రాంకైటిస్, నిమోనియా వంటి సమస్యలను దరి చేరకుండా ఉంచుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి