చాలా మంది మహిళలు ప్రసవం తరువాత చాలా బలహీనంగా వుంటారు కాబట్టి వారు ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ఇంకా ఆరోగ్యకరమైన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి.వారు త్వరగా కోలుకోవడానికి తాజా భోజనం సిద్ధం చేసుకోని తినాలి. ఇక ఆయుర్వేదం ప్రకారం చూసినట్లయితే తాజాగా వండిన ఆహారంలో ఎక్కువ ప్రాణశక్తి అలాగే పోషకాహార కంటెంట్ అనేది ఉంటుంది. అందుకే ఈ ఆహారం డెలివరీ తర్వాత తల్లి చాలా వేగంగా కోలుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇక ప్రసవం తరువాత ఆహారంలో వాత మూలకాన్ని శాంతపరచగల కొన్ని ఆహార పదార్థాలు అమ్మ తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా ఉండాలి. కూరగాయల సూప్‌లు, అన్నం, నెయ్యి ఇంకా పాలు మొదలైన వాటిలో ఆహారం ప్రధానంగా ఉండేటట్లు చూసుకోవాలి.ఇక సాధారణంగా మహిళకి శిశువు జన్మించిన 21 రోజుల వరకు పండ్లు తినకుండా వాటికి దూరంగా ఉండాలి.

మెంతి ఆకులు ఇంకా మెంతులవంటి ఆహారాలు తల్లి పాలివ్వడాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడతాయి.ఆరోగ్యకరమైన ఇంకా పోషకమైన ఆహారాన్ని తీసుకోకపోతే అది తల్లి శరీరంలో బాగా అసమతుల్యతను సృష్టించడం జరుగుతుంది. ఇది ఆమె బరువు బాగా పెరగడానికి లేక ఆర్థరైటిస్ వంటి ఇతర దీర్ఘకాలిక రోగాలకు గురయ్యేలాగా చేస్తుంది. జాజికాయ, కొత్తిమీర, శతావారి, పసుపు ఇంకా తులసి వంటి మూలికలు డెలివరీ తర్వాత కాలంలో తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇక ప్రసవ తర్వాత 48 వ రోజు వరకు  కూడా సాధారణ ఆహారం తీసుకుంటే చాలా మంచిదని వైద్యులు తెలుపుతున్నారు.చల్లటి ఆహారం ఆహారం అస్సలు తినకూడదు. ఎందుకంటే అది అవసరమైన పోషకాన్ని అందించదు. చల్లటి ఆహారం వాత దోషాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రసవం తరువాత తినే ఆహారం ఖచ్చితంగా వెచ్చగా ఉండాలి.ఇక ఈ కాలంలో జీర్ణక్రియ సులభంగా అయ్యేందుకు తల్లి తీసుకునే ఆహారం ఎంతో మృదువుగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: