అసలు సమయపాలన లేని ఆహారం తీసుకోవడం అలాగే జీవనశైలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మన శరీరంలోని కిడ్నీ ఇంకా పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే సమస్య వల్ల మనిషి తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి వస్తోంది.ఇక వల్ల మనిషి భరించలేని నొప్పిని ఎదుర్కోవాల్సి వస్తుంది. పిత్తాశయంలో కనుక రాళ్లు ఏర్పడితే.. ఆపరేషన్ తప్ప మేరే మార్గం లేదు.అలాగే మరోవైపు కిడ్నీలోనూ పెద్ద పరిమాణంలో రాళ్లు ఏర్పడితే అప్పుడు కూడా ఆపరేషన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాల్సి వస్తుంది. అయితే, మూత్రపిండాల్లో ఏర్పడే చిన్న చిన్న రాళ్లను ఆపరేషన్ ద్వారా కాకుండా మెడిసిన్స్ అలాగే ఇంట్లో లభించే సహజ పదార్థాలతోనే సులభంగా తగ్గించుకోవచ్చు. దీనికి కొన్ని నియమాలు పాటించడంతో పాటు.. ఓపిక అనేది కూడా చాలా అవసరమని చెప్పాలి.ఇక మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్ల సమస్యను ఎలా తొలగించుకోవాలంటే..పత్తర్ చట్టా మొక్క మూత్ర పిండాల్లో ఏర్పడే రాళ్ల సమస్యని కరిగిస్తుంది. ఇక ఈ చెట్టు ఆకుని తీసుకుని దానికి కొద్దిగా చక్కెర కలిపి దాన్ని మెత్తగా రుబ్బాలి. ఇక ఈ ఆకు మిశ్రమాన్ని రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం వల్ల రాయి అనేది త్వరగా కరిగి ఇక బయటకు వచ్చేస్తుంది.ఒక గ్లాసు కొబ్బరి నీళ్లలో సగం నిమ్మకాయను పిండుకుని ఆ నీళ్లు తాగితే మూత్రం ద్వారా రాళ్లు సులభంగా బయటకు వచ్చేస్తాయి.

పొద్దున్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.పెద్ద ఏలకులను తీసుకొని వాటిని పొడి చేసి.. ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్ఫూన్ పొడిని వేసి అందులో కలపాలి.దాంతోపాటు ఒక టీస్ఫూన్ చక్కెరను ఇంకా కొన్ని పుచ్చకాయ గింజలు వేసి రాత్రంతా కూడా నానబెట్టాలి.తరువాత ఉదయాన్నే వాటిని బాగా నమిలి తినాలి.ఆ తరువాత ఆ నీళ్లను తాగాలి.ఇలా రోజూ గనుక చేస్తే కొద్ది రోజుల్లోనే రాళ్ల సమస్య నుంచి తక్షణమే ఉపశమనం పొందవచ్చు.మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లు ఈజీగా బయటకు రావాలంటే..ఉదయం పూట పరిగడుపున ముల్లంగిని తినాలి.ఖచ్చితంగా కూడా ప్రతి రోజు ఎక్కువ సార్లు నీళ్లు తాగాలి.ఇలా కొన్ని రోజులు గనుక కొనసాగిస్తే.. కిడ్నీ స్టోన్స్ సమస్య నుంచి తక్షణమే ఉపశమనం పొందవచ్చు.అలాగే ఒక గ్లాసు నీటిలో ఒక నిమ్మకాయను పిండి, అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి దాన్ని బాగా మిక్స్ చేసి తాగాలి. నిమ్మరసం అనేది రాళ్లను బాగా విచ్ఛిన్నం చేయడానికి పనిచేస్తుంది. ఆలివ్ నూనె ఆ రాళ్లను బయటకు పంపడంలో ఎంతగానో సహాయపడుతుంది.అలాగే యాపిల్ వెనిగర్‌లో సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది కిడ్నీలో వుండే రాళ్లను చిన్న రేణువులుగా కట్ చేస్తుంది. అలాగే గోరువెచ్చని నీటితో రెండు టీస్పూన్ల వెనిగర్ ని తీసుకుంటే రాళ్ల సమస్య నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: