నేటి రోజుల్లో ఉరుకులు పరుగుల జీవితంతో ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం ఎవరికీ లేకుండా పోయింది.. అంతేకాదు నేటి రోజుల్లో ఉద్యోగాలు కూడా ఒకేచోట గంటల తరబడి కూర్చొని చేసేవి కావడంతో ఇక తినడం కూర్చోవడమే సరిపోతుంది ప్రతి ఒక్కరికి. దీంతో ఎంతో మంది బరువు పెరిగి పోవడం లాంటివి జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరికీ వ్యాయామం చేయాలని ఎంతో ఫిట్ గా ఉండాలి అని అనుకున్నప్పటికీ.. ఉరుకుల పరుగుల జీవితంలో జిమ్కు వెళ్లి వ్యాయామానికి సమయం కేటాయించలేని పరిస్థితి చాలా మందికి ఉంది.


 దీంతో వ్యాయామం చేయాలి అనుకునేవారు సమయం దొరకక చివరికి సైలెంట్ గానే ఉండిపోతున్నారు. కానీ అటువంటి వారు మాత్రం రోజురోజుకూ బరువు పెరిగిపోతున్న ఉండటం కారణంగా ఎంతో ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అయితే ఇక మనకు తెలియకుండానే బరువు సులభంగా పెరిగి పోతూ ఉంటాము. కానీ బరువు తగ్గించడం మాత్రం చాలా కష్టమనే చెప్పాలి. ఇక ఒకసారి బరువు పెరిగి పోయిన తర్వాత వెయిట్ లాస్ కావటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలా మంది. ఇక ఎన్నో డబ్బులు కూడా ఖర్చు పెడుతూ వుంటారు చాలామంది.



 అయితే బరువు  తగ్గించుకునేందుకు జిమ్ కు వెళ్లాలని అనిపించినప్పటికీ సమయం దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటే.. మీకు ఇక బరువు తగ్గించుకోవడానికి జిమ్ కి వెళ్లనక్కర్లేదు. ఇంట్లోనే బరువు తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.. మీ దగ్గర ఒక స్కిప్పింగ్ రోప్ ఉంటే చాలు అని అంటున్నారు.. మొదట స్కీపింగ్ 10 తో స్టార్ట్ చేసి ఆ తర్వాత పెంచుకుంటూ పోవాలి. ఇలా రోజూ పది నిమిషాల పాటు స్కిప్పింగ్ చేస్తే బరువు తగ్గే అవకాశం ఉంటుం దట. స్కిప్పింగ్ చేయడం వల్ల 200 కేలరీలు కరిగించవచ్చు నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా పుష్ అప్స్, సిట్ అప్స్, స్క్వాట్స్  చేస్తే క్రమ క్రమంగా బరువు తగ్గే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Zym