ముఖ్యంగా మన శరీరంపై ఒత్తిడి, పోషణ ,నీరు తీసుకోవడం , ఇలా చాలా కారకాలపై చర్మ స్వభావం కూడా ఆధారపడి ఉంటుంది.. అంతే కాదు మన శరీరంలో జరిగే మార్పులను మనం ముఖం ద్వారా తెలుసుకోవచ్చు అని కూడా చెబుతున్నారు. అందుకే నిపుణులు ప్రతి రోజూ తగినన్ని నీళ్లు తాగడంతోపాటు కంటి నిండా నిద్ర , ఆరోగ్య కరమైన జీవనశైలిని గడపాలి అని చెప్పడంతో పాటు ఆకుకూరలు, పండ్లను కూడా తినే ఆహారంలో చేర్చుకోవాలని సలహా కూడా ఇస్తున్నారు.
ఇకపోతే మనలో చాలా మందికి వారి చర్మ స్వభావం ఏమిటో తెలియకపోవచ్చు. అయితే మీరు మీ చర్మ తత్వాన్ని ఇలా కూడా గుర్తించవచ్చు.
బ్లాస్టింగ్ షీట్ విధానం:
బ్లాటింగ్ పేపర్ ను మీ ముఖం మీద మృదువుగా అప్లై చేయండి. ఇక చేసిన తర్వాత ఆయిల్ విజిబులిటీ ని తెలుసుకోవడం కోసం విండో దగ్గర లేదా లాంప్ వంటి లైట్ సోర్స్ వద్ద మీరు టెస్ట్ చేసుకోవచ్చు.
ముందుగా పేపర్ మీద ఎలాంటి ఆయిల్ కనిపించకపోతే మీది పొడిచర్మం అని భావించాలి.
ఒకవేళ నుదురు, ముక్కు, గడ్డం, బుగ్గలు వంటి ప్రాంతాల దగ్గర ఆయిల్ కనిపిస్తూ ఉన్నట్లయితే.. మీది డ్రై అండ్ ఆయిల్ కాంబినేషన్ స్కిన్ అని గుర్తు పట్టవచ్చు.
ఇక బ్లాటింగ్ పేపర్ కనుక పూర్తిగా ఆయిల్ గా కనిపిస్తే ఇక చర్మం ఆయిల్ స్కిన్ అని పరిగణించాలి. చూశారు కదా ఈ పద్ధతి ద్వారా మీ చర్మం ఎలాంటిదో టెస్ట్ చేసుకోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి