ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాలకు ఈ కరోనా ఒమిక్రాన్ వ్యాపించింది ఇక ఇప్పటికే దాదాపు సగానికి పైగా దేశాలు ఈ వైరస్ బారిన పడి సతమతమవుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో కూడా ఈ ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో .. శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన అధ్యయనంలో కొన్ని విషయాలను వెల్లడించడం జరిగింది.ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయనే విషయం పై కొవిడ్-19 ట్రాకింగ్ స్టడీ పేరుతో తాజాగా ఒక అధ్యయనం జరిగింది.
మనకు కరోనా ఒమిక్రాన్ సోకినట్లయితే.. ప్రధానంగా ముక్కు కారడం, తలనొప్పి, వాంతి వచ్చినట్లు అనిపించడం.. తల తిరిగినట్లుగా అనిపించడం, గొంతులో గరగర లాంటి లక్షణాలు మనలో కనిపిస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ ఒమిక్రాన్ కి సంభందించిన ప్రధాన లక్షణాలన్ని సాధారణ జలుబు లక్షణాలనే పోలి ఉంటాయని అధ్యయనం తెలిపింది. ఒమిక్రాన్ బారినపడిన వేలమంది నుంచి వారి అభిప్రాయాలు సేకరించి తాజా నివేదికను సిద్ధం చేసినట్లు అధ్యయనకారులు తెలిపారు. అయితే..మిగతా కరోనా వేరియంట్ల లాగా.. ఈ వేరియంట్ సోకిన వారిలో ఎడతెగని దగ్గు, రుచిని కోల్పోవడం , తీవ్రమైన జ్వరం, వాసన కోల్పోవడం లాంటి లక్షణాలేవి కనిపించలేదని అధ్యయనకారులు పేర్కొన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి