మన జీవితంలో తరచూ కొన్ని రకాల ఘటనలు జరుగుతూనే ఉంటాయి.. అవి సర్వసాధారణం అని అంతగా పట్టించుకోకుండా లైట్ తీసుకుంటాం. ఇలాంటి వాటిలో అటు తలపై దోమలు వాలడం కూడా ఒకటి. సాయంత్రం సమయంలో ఎక్కడికైనా వెళ్ళాము అంటే చాలు తలపై దోమలు వాలుతూ ఉంటాయ్. కొన్ని కొన్ని సార్లు తలపై దోమలు తిరుగుతూ ఉంటే చిరాకు వస్తుంటుంది. చేతులతో విసిరినప్పటికి కూడా దోమలు అలాగే వాలుతూ ఉంటాయి  అలా ఎందుకు వాలుతున్నాయి అన్న విషయాన్ని పట్టించుకోకుండా అందరూ లైట్ తీసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఇంతకీ అలా తలపై దోమలు ఎందుకు వాలుతాయి  అన్నది మాత్రం చాలామందికి తెలియని ప్రశ్న. అయితే ప్రస్తుతం శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం.. మనిషి  ఆక్సిజన్ పీల్చుకొనే కార్బన్ డయాక్సైడ్  విడుదల చేస్తూ ఉంటారు. మనుషులు విడుదలచేసే కార్బన్డయాక్సైడ్ కు అటు దోమలు ఆకర్షణకు గురవుతాయట. ఈ కార్బన్డయాక్సైడ్ కారణంగానే 10 మీటర్ల దూరం నుంచి అక్కడి మనుషులు ఉన్నారని దోమలు గుర్తిస్తాయట  ఇక మనిషి వద్దకు చేరుకోగానే ఆడ దోమలు మనిషిని కుట్టడం ప్రారంభిస్తే మగ దోమలు మాత్రం తల మీద తిరగడం చేస్తాయట. ఇక మనిషి శరీరంపై వేడి ఉండడం కారణంగా వెంట్రుకల పైకి రావడానికి దోమలు ఇష్టపడతాయట. ఈ విషయం పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


 అదే సమయంలో దోమలు తలపై  రావడానికి శరీరంపై చెమట కూడా ఒక కారణం అని అంటున్నారు పరిశోధకులు. వ్యాయామం చేసినప్పుడు లేదా శారీరక శ్రమ ఉన్నప్పుడు తలపై చెమట ఏర్పడటం లాంటివి జరుగుతుంది. ఇక తలపై జుట్టు ఉండడంతో చెమట చాలా సమయం పాటు అలాగే ఉండిపోతుంది  ఇలాంటి సమయంలోనే ఆక్టనాల్ అనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయట. దీనికి దోమలు ఎక్కువగా ఆకర్షింపబడతాయి అన్నది పరిశోధకులు చెబుతున్నారు. మగ దోమలు మనుషులను కుట్టవు అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఆడ దోమలు మనుషులను కుట్టడానికి వెళితే ఇక వాటిని వెతుక్కుంటూ మగ దోమలు అక్కడికి వస్తాయట.. ఇలా ఆడ దోమలు ఇక మనుషులను కుట్టి రక్తం పీల్చే పనిలో ఉంటే మగ దోమలు మాత్రం తల పై వాలి చిరాకు తెప్పిస్తాయి అంటున్నారు శాస్త్రవేత్తలు.

మరింత సమాచారం తెలుసుకోండి: