
అయితే ఇందుకోసం మీరు చేయవలసిందల్లా మీ వంటగది లో దొరికే మీడియం సైజు కలిగిన మూడు నుంచి నాలుగు పచ్చి పసుపు కొమ్ములు, రెండు మీడియం సైజు క్యారెట్లు, రెండు అంగుళాల చిన్న అల్లం ముక్క. ఇక ఈ మూడింటిని జ్యూస్ రూపంలో చేసి ప్రతిరోజు 20 నుంచి 30 ఎమ్ఎల్ మొత్తంలో తీసుకోవడం వల్ల తక్షణ శక్తి రావడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి.

క్యారెట్లో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి మొదటి పాత్ర వహిస్తుంది. ఎప్పుడైతే విటమిన్-సి శరీరానికి సమర్థవంతంగా అందుతుందో అప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఈ విటమిన్ సి సహాయపడుతుంది.
అల్లం లో కూడా రోగనిరోధకశక్తిని పెంపొందించే లక్షణాలు ఉండటం వల్ల జలుబు , దగ్గు వంటి లక్షణాల నుంచి విముక్తి కలిగిస్తుంది.. కాబట్టి ఈ మూడింటిని కలిపి తీసుకోవడం వల్ల మనకు తక్షణమే ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి