ప్రతి ఒక అమ్మాయి ఎంత అందంగా కనిపించినప్పటికీ.. ముఖం మీద ఏర్పడే నల్లటి మచ్చల కారణంగా ముఖం అందం కూడా చెడిపోతుంది.. నల్లటి మచ్చలను, మొటిమలను దూరం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ విసుగు చెందుతుంటారు.. అందరికీ అందుబాటులో ఉండే ఈ ఆకుతో మరింత అందాన్ని పెంపొందించుకోవడంతో పాటు ముఖం మీద వచ్చే మొటిమలు.. మొటిమల కారణంగా వచ్చే మచ్చలు కూడా దూరమవుతాయి.. ఇకపోతే ఈ ఏ ఆకును ఉపయోగించి మచ్చలను దూరం చేసుకోవచ్చో మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం..

ఈ ఆకులు ఏవో కాదు హిందువులు అత్యంత పవిత్రంగా భావించే రావి చెట్టు యొక్క ఆకులు.. రావి చెట్టు ఎంతో పవిత్రమైనది అని కేవలం దైవంగా మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది అని ప్రజలు విశ్వసిస్తారు. ఇప్పుడు తాజాగా వెల్లడైన విషయం ఏమిటంటే ఈ రావి ఆకులు కేవలం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా సహాయపడతాయని.. ఇకపోతే ఈ రావి ఆకులను ముఖానికి ఎలా అప్లై చేసుకోవాలో మనమిప్పుడు చదివి ఒకసారి  తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


నాలుగైదు రావి ఆకులను తీసుకొని నీటిలో శుభ్రంగా కడిగి , మిక్సీలో వేసి , కొద్దిగా నీరు పోసి మెత్తటి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా పసుపు కలిపి ముఖానికి ఈవెన్ గా అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు ముఖాన్ని బాగా ఎండబెట్టాలి. ఇప్పుడు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసి కాటన్ టవల్ తో మాత్రమే ముఖాన్ని తుడుచుకోవాలి.. ఈ పద్ధతిని ప్రతి రోజూ పాటించడం వల్ల కేవలం మూడు రోజుల్లోనే మీ ముఖం మీద ఉండే మచ్చలు తగ్గుముఖం పడతాయి. రావి ఆకులతో చేసిన ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతేకాదు వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఈ రావి ఆకులను ఉపయోగించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: