2019 డిసెంబర్ నెలలో ఎక్కువగా చైనా దేశంలో ఈ కరోనా ప్రజలకు వ్యాపించి కలకలం సృష్టించింది. అక్కడినుంచి ఎవరైతే ప్రజలు విదేశాలకు వెళ్లారో వారి ద్వారా ఇతరులకు సోకడం ఇలా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఈ కరోనా బారిన పడ్డారు.. అంతేకాదు కొంతమందికి ఆర్థిక నష్టం.. మరికొంత మందికి ప్రాణనష్టం .. ఇంకొంతమందికి ఇలా రకరకాల నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఈ కరోనా మహమ్మారి కారణంగా.. ఈ కరోనా వైరస్ అనేది ఎక్కువగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కాబట్టి మనుషులే ఈ వైరస్ కు వాహకాలుగా తయారవుతున్నారు.. అందుకే ప్రజలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లకుండా వారి ఇంట్లోనే ఉంటూ కరోనా నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్న విషయం తెలిసిందే. అందుకే గత రెండు సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధిస్తూ కర్ఫ్యూ లు విధించడం జరిగింది.


అయితే ఈ లాక్ డౌన్  వల్ల అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి కూడా పూర్తిస్థాయిలో ఆర్థిక నష్టం వాటిల్లింది. అంతేకాదు ప్రజలు సైతం పనులు చేసుకుని డబ్బు సంపాదించుకునే వారు కూడా ఈ లాక్ డౌన్ సమయంలో బయటకు వెళ్ళలేక ఆర్థికంగా, తిండి కూడా లేని రోజులను గడపాల్సి వచ్చింది. అయితే గత రెండు సంవత్సరాలుగా మొదటి దశ ,రెండవ దశ కరోనా  ప్రజలను ఇబ్బంది పెట్టగా ఇప్పుడు మూడవ దశ గా ఒమిక్రాన్  పేరిట ప్రజలను ఇబ్బంది పెడుతోంది. అందుకే మళ్లీ లాక్ డౌన్ పెట్టాలని, కర్ఫ్యూలు విధించాలని ఇతర రాష్ట్రాలు కూడా ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.


ఇకపోతే ఈ వారం ఏ రాష్ట్రాలలో కర్ఫ్యూ విధించారు అనే విషయానికి వస్తే.. కర్ణాటకలో వారాంతపు కర్ఫ్యూను ఎత్తి వేయడం జరిగింది.. అయితే అక్కడి కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నట్లు సమాచారం. ఇక తెలంగాణలో పూర్తిస్థాయిలో ఆదివారాలలో లాక్ డౌన్ విధించారు. ఇకపోతే కేరళ లో కేసులు పెరుగుతున్నప్పటికీ అక్కడ మాత్రం వారు ఏమాత్రం లాక్ డౌన్ విధించడం లేదు. ఇక న్యూజిలాండ్ లో కూడా కరోనా  కేసులు బాగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ వారు లాక్ డౌన్ పెట్టక పోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: