సాధారణంగా అన్నం తినడం వల్ల మనకు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా వాతం వచ్చే అవకాశం ఎక్కువ.. చాలామంది తిన్న వెంటనే పడుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా చేయడం అసలు మంచి పద్ధతి కాదని పైగా మూడు పూటలా భోజనం చేయడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. ఉడికించిన బియ్యం లో కేలరీలు ఎక్కువగా ఉండడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది . అంతే కాదు రక్తంలో చక్కెర స్థాయిని పెంచడానికి చాలా దోహదపడుతుంది కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు సాధ్యమైనంతవరకు అన్నం తినడానికి దూరంగా ఉంటే చాలా మంచిది.
ఎక్కువగా కేలరీ లు ఉండటం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరైనా సరే బరువు తగ్గాలని భావించే వాళ్ళు తినే ఆహారంలో అన్నం పరిమితంగా తీసుకోవడం మంచిది. మార్కెట్లో రకరకాల రైస్ లు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అవసరమైతే బ్రౌన్ రైస్ వండుకుని తినవచ్చు. తెల్ల బియ్యం లో పీచు పదార్థం ఎక్కువగా ఉండవు.. అలాంటప్పుడు తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు కాబట్టి బ్రౌన్ రైస్ తినడం వల్ల కడుపు ఉబ్బినట్టు అనిపించే సమస్య లేదు. పైగా ఎలాంటి సమస్యలు దరిచేరవు.. అన్నం ఎక్కువగా తినడం వల్ల శరీరం నీరసంగా మారి.. బద్దకం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అన్నం తినేటప్పుడు మూడు పూటలా కొద్దిగా పరిమాణంలో తీసుకుంటే మంచిది కానీ పూర్తిగా కడుపు నిండే వరకు అన్నం తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి