సాధారణంగా మన ఇళ్లలో పచ్చికొబ్బరి ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అంటే ఏదైనా పండుగలప్పుడు లేదా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడికి నైవేద్యంగా కొబ్బరికాయలు సమర్పించినప్పుడు అక్కడి నుంచి కొంచెం పచ్చి కొబ్బరి ని ప్రసాదంగా ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాము. పచ్చికొబ్బరి తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని .. దగ్గు కూడా వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు.. వారంలో రెండు లేదా మూడు సార్లు చిన్న పచ్చికొబ్బరి ముక్క తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.


పచ్చికొబ్బరిలో ఉండే మంచి కొవ్వు కారణంగా.. గుండె సంబంధిత జబ్బులు దూరం అవుతాయి.. థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ఈ పచ్చికొబ్బరి చాలా బాగా పనిచేస్తుంది. పచ్చికొబ్బరి లో యాంటీ ఫంగల్,  యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉండటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఎటువంటి వైరస్ ను శరీరం దరిచేరనివ్వదు. ముఖ్యంగా వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో కొబ్బరి లో ఉండే పోషకాలు బాగా సహాయపడుతాయి. పచ్చి కొబ్బరి లో బి కాంప్లెక్స్ తో పాటు ఫోలేట్, రైబోఫ్లెవిన్, విటమిన్ లు, నియాసిన్, థయామిన్ వంటి పోషకాలు లభిస్తాయి. నోటి పూత వచ్చే సమస్య కూడా ఉండదు.

పచ్చి కొబ్బరి లో 60 శాతానికిపైగా ఫైబర్ ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. ఎప్పుడైతే ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుందో అప్పుడు మలబద్ధకం జీర్ణ సంబంధ సమస్యలు కూడా తగ్గిపోతాయి. అల్జీమర్స్ వంటి వ్యాధులు కూడా దూరమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేస్తాయి. చర్మం పై వచ్చే మచ్చలు ,ముడతలు దూరం చేయడంలో పచ్చికొబ్బరి చాలా బాగా పనిచేస్తుంది. పచ్చికొబ్బరి నుండి తీసిన పాలను జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు ఒత్తుగా , పొడవుగా పెరుగుతుంది. రక్తహీనత మూత్ర విసర్జనలో ఇన్ఫెక్షన్లు వంటి వాటిని కూడా దూరం చేయడంలో పచ్చికొబ్బరి చాలా బాగా పనిచేస్తుంది. కేవలం వారానికి రెండు లేదా మూడు సార్లు చిన్న పరిమాణంలో తీసుకుంటేనే ఈ ప్రయోజనాలు కలుగుతాయని గుర్తించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: