ఇక ఈ సమస్య ఎవరి అదుపులో ఉండదు. ఎందుకంటే జన్యుపరమైన కారణాల వల్ల ఒక వ్యక్తి ఈ వ్యాధికి గురవుతాడు కాబట్టి. వైద్యుల ప్రకారం.. హైపర్ కొలెస్టెరోలేమియా అనేది చిన్న వయస్సులోనే కొంతమందిలో ఉండే జన్యుపరమైన వ్యాధి అట. దీని కారణంగా చిన్న వయస్సులోనే LDL కొలెస్ట్రాల్ అనేది పెరగడం ప్రారంభమవుతుంది. ఇక దీని కారణంగా గుండెపోటు ప్రమాదం అనేది ఉంటుంది.ఇక తగిన జాగ్రత్తల కోసం ఆహారంలో తక్కువ నూనె వాడాలి. రోజూ కనీసం అరగంట పాటు సైక్లింగ్ ఇంకా అలాగే జాగింగ్ లేదా ఏదైనా వ్యాయామం చేయాలి. పొగాకు ఇంకా అలాగే మద్యపానానికి దూరంగా ఉండాలి. ఆరు నుంచి ఎనిమిది నెలలకు ఒకసారి గుండె పరీక్షని ఖచ్చితంగా చేయించుకోవాలి.అసలు ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలి. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు యోగా ఇంకా అలాగే మెడిటేషన్ ద్వారా కంట్రోల్ చేయాలి. ఇక అలాగే వీటన్నింటితో పాటు తగినంత నిద్ర పోవడం అనేది కూడా చాలా అవసరం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి