ఇటీవల కాలంలో తినే అన్నం నుంచి తాగే నీటి వరకు ప్రతి ఒక్కటి కూడా కలుషితం అవుతున్నాయి. ఇక కొంతమంది వ్యాపారులు కూడా తమ లాభార్జన కోసం ఎటువంటి శుచి, శుభ్రత లేకుండా  కల్తీ చేసి ఆహారాలను మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు. అందులో భాగంగానే ఉదయం లేచింది మొదలు మనకు పాలు అనేవి చాలా తప్పనిసరిగా ఉపయోగపడతాయి. ఉదయం లేవగానే కొంతమందికి కాఫీ లేదా టీ తాగనిదే రోజు గడవదు. కాబట్టి ఖచ్చితంగా పాలతో అవసరం ఉంటుంది. ఇక పోతే కొంతమంది ఎక్కువ డబ్బు సంపాదించడానికి అడ్డదారిలో పాలలో యధేచ్చగా  కెమికల్స్ కలుపుతున్నారు.

ఇక పాలల్లో నీళ్ళలా కలిసిపోవడంతో వీటిని గుర్తించడం చాలా కష్టంగా మారుతోంది.. ఇక  పాలు కల్తీ అయ్యాయో లేదో తెలుసుకోలేక సామాన్య ప్రజలు కూడా అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పాలలో కల్తీ పదార్థాలను పసిగట్టే డిప్ స్టిక్ ను గుజరాత్లోని అమ్రేలి కాలేజ్ ఆఫ్ డైరీ సైన్స్ వారు అభివృద్ధి చేయడం జరిగింది. ఇక ఈ డిప్ స్టిక్ ను ఉపయోగించి కేవలం రూ.1 ఖర్చు తో పాల యొక్క క్వాలిటీ ని మీరు ఇంటి వద్ద అత్యంత సులభంగా టెస్ట్ చేసుకోవచ్చు. ఇకపోతే పాలలో ఉండే కల్తీ పదార్థాలను గుర్తించే ఈ డిప్ స్టిక్ త్వరలో అందరికీ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

ఇక ఈ డిప్ స్టిక్ సహాయంతో పాలలో ఎనిమిది రకాల కల్తీ పదార్థాలను కేవలం ఒక్క క్షణంలోనే గుర్తించవచ్చు. ఇక దీని గొప్పతనం ఏమిటంటే.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ తాజాగా నిర్వహించిన జాతీయ స్థాయి కృతగ్య హ్యాకథాన్ 2.0 పోటీలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. ఇక ఈ పోటీలో దేశ వ్యాప్తంగా 1974 మంది తమ కొత్త ఆవిష్కరణలతో పాల్గొనగా.. ఏప్రిల్ 13వ తేదీన వాటి ఫలితాలను ప్రకటించడం జరిగింది. అమ్రేలి కాలేజ్ ఆఫ్ డైరీ సైన్స్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. అప్రూవల్ అయిన తర్వాత గ్రామస్తులు,  నగరవాసులు కూడా తమ ఇళ్ల వద్ద పాల కల్తీ ని సులువుగా గుర్తించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: