మన శరీరం ఎక్కువగా 70 శాతం వరకు నీటితో నిండి ఉంటుంది. ఈ విషయం మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాము.. అయితే కొన్ని రకాల ఆహారం తీసుకోవడం వల్ల మనం ఆహారం తినకుండా కొన్ని రోజులపాటు ఉండగలం.. కానీ నీరు తాగకుండా బతకడం అంటే అది చాలా కష్టమైన పని అని చెప్పవచ్చు. ప్రతిరోజు కనీసం 2 నుంచి 4 లీటర్ల వరకు నీటిని తాగడం వల్ల డీ హైడ్రేషన్ కు గురవకుండా ఉండగలరు. కానీ కొంతమందికి మాత్రం రోజు వారికి సరిపోయే అంత నీరు శరీరంలో లేకపోతే చాలా డి హైడ్రేషన్ కు గురవుతూ ఉంటారు.ఇలా ఇబ్బంది పడ్డ వారికి కొన్ని లక్షణాలు బయటికి వస్తాయి
 డీహైడ్రేషన్కు గురికాకుండా ఉండేందుకు పలు సంకేతాలను మనం గుర్తించవచ్చు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


లాలాజలంలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల మన శరీరానికి కావల్సిన శక్తి తయారు చేయకుండా నిరోధిస్తుంది. దీంతో నోటి లో ఎక్కువగా బ్యాక్టీరియా పెరిగిపోతుంది. దీంతో నోటి దుర్వాసన ఎక్కువగా వస్తుంది.

డీహైడ్రేషన్ కు గురైన వారిలో ముఖ్యంగా నోటి లోపలి భాగం ఎర్రగా పొడిగా మారుతుంది. చర్మం చుట్టూ కాస్త అట్ట కట్టినట్లుగా అనిపిస్తుంది. డీహైడ్రేషన్ మీ మెదడును కష్టతరమైనది గా ప్రభావితం చేస్తుంది. ఇక అంతే కాకుండా ఇది తీవ్రమైన అలసట కూడా ప్రేరేపిస్తుంది.


డీహైడ్రేషన్ కావడం వల్ల చర్మం కళ్ళు కూడా పొడిబారతాయి. ఇక అంతే కాకుండా ఇలాంటి వారిలో ఎక్కువగా యూరిన్ సమస్యలు కూడా తలెత్తుతాయి. కండరాలు ఎక్కువగా నొప్పి తలనొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. కొందరికి గుండె వేగంగా కూడా కొట్టుకోవడం వంటి లక్షణాలు వస్తాయి. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ స్థాయిలు అసమతుల్యతకు దారితీసినప్పుడు ఎక్కువగా డీహైడ్రేషన్ కు గురి అవుతారు. ఇలాంటి లక్షణాలు ఉంటే త్వరగా నీటిని తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: