వంకాయ కూర అంటే ప్రతి ఒక్కరు కూడా నోరూరిస్తూ తింటూ ఉంటారు. ముఖ్యంగా గుత్తి వంకాయ కూర అంటే గుటకలేసుకుంటూ తింటూ ఉంటారని చెప్పవచ్చు. వంకాయ తినడానికి చాలా రుచిగా ఉండడంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తున్నది. అయితే కొంతమంది మాత్రం వంకాయ కూర తినకూడదని వైద్యులు తెలియజేస్తూ ఉంటారు. ఒకవేళ వైద్యులు కాదని తింటే ప్రమాదంలో పడతారని తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో వంకాయలు మాత్రం అసలు తినకూడదని చెప్పవచ్చు. గర్భిణీల తో పాటు ఇంకొంతమంది కూడా వంకాయలను తినకూడదని వైద్యులు తెలియజేస్తున్నారు మరి ఎవరెవరు తినకూడదో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.


1).జీర్ణ వ్యవస్థ చాలా బలంగా ఉండేవారు వంకాయ కూరను తింటే గ్యాస్ సమస్యలు ఎక్కువగా పెరిగిపోతాయి.


2). డిప్రెషన్ తో ఇబ్బంది పడుతున్న వారికి వంకాయ కూర ఒక మెడిసిన్ లా పనిచేస్తుంది. ఇతర ఆందోళనతో ఇబ్బంది పడ్డట్లు అయితే వంకాయ కూరను తినకుండా ఉండడం మంచిది.


3). కళ్ళకు ఏదైనా సమస్యతో ఉన్నవారు వంకాయ కూరకు దూరంగా ఉండటం మంచిది. ఎందుచేత అంటే ఇది కళ్ళకు మంట దురద పెట్టేలా చేస్తాయని వైద్యులు తెలియజేస్తున్నారు.


4). పైల్స్ సమస్యతో బాధపడుతున్నట్లు అయితే వంకాయని తినకూడదు దీనివల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.


5). కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు అయితే వంకాయలు ఉండే ఆక్సలైట్ వల్ల రాళ్ల సమస్య మరింత పెరుగుతుంది.

6). రక్తహీనత సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడేవారు వీటిని తినకూడదు ఎందుచేత అంటే ఇది రక్తం పెరుగుదలకు అడ్డంకిగా మారుతాయి ఈ కారణంగానే రక్తం తక్కువగా ఉన్న వారు వైద్యులు వీటిని తినకూడదని తెలియజేస్తూ ఉంటారు.


7). ముఖ్యంగా చర్మం పైన ఏదైనా అలర్జీ కలిగిన వారు ఈ వంకాయ కూరలను తినకూడదు. ఒకవేళ తింటే ఆ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: