ప్రస్తుత కాలంలో మారిపోతున్న లైఫ్ స్టైల్ కారణంగా ఈ పరిస్థితుల్లో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అదే సమయంలో చాలా సార్లు ప్రజలు బరువు తగ్గడానికి ప్రత్యేక ఆహారం తీసుకోవడంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉంటారు. కానీ.. బరువు మాత్రం తగ్గదు. ఇలా మీరు కూడా బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడుతుంటే ఆహారంలో వామును ఉపయోగించవచ్చని పేర్కొంటున్నారు. మీరు ప్రతిరోజూ వామును తీసుకుంటే జీర్ణవ్యవస్థ బలంగా ఉంటుందని చెబుతున్నారు. అధిక బరువు, బెల్లీ ఫ్యాట్‌ను వదిలించుకోవడానికి వాము గింజలను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.వాము ప్రతిరోజూ తీసుకుంటే.. జీర్ణవ్యవస్థను బలపడుతుంది. బరువు తగ్గడానికి వామును నమిలి అర గ్లాసు నీటిని తాగాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.వాము టీ తాగడం ద్వారా బరువు తగ్గడంతో పాటు పొట్ట కొవ్వు కూడా కరిగిపోతుంది.
కావున మీరు కూడా బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతుంటే ఇప్పటి నుంచే వాము టీని తీసుకోవచ్చు. వాము టీ తీసుకోవడానికి ఒక గిన్నెలో సగం గ్లాసు నీరు తీసుకోండి.. దానిలో అర టీస్పూన్ వాము వేయండి. ఆ తర్వాత 2 నుంచి 3 నిమిషాలు వేడిచేయండి. ఆ తర్వాత ఈ నీటీని ఫిల్టర్ చేసి తాగాలి.వాము తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ సులభంగా బయటకు వస్తాయి. శరీర జీవక్రియ కూడా వేగవంతం అవుతుంది. వాము నీరు తయారు చేయడానికి అర టీస్పూన్ వాము గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఈ నీటిని ఉదయాన్నే వడగట్టి తాగండి.. ఇలా రోజూ చేయడం వల్ల బరువు పెరగడంతోపాటు పొట్ట కూడా తగ్గుతుంది.కాబట్టి ఖచ్చితంగా మీరు వాముని ఇలా తీసుకొని ట్రై చెయ్యండి. ఖచ్చితంగా అధిక బరువు తగ్గి పొట్ట కూడా తగ్గి చాలా ఫిట్ గా ఇంకా అలాగే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి.
మరింత సమాచారం తెలుసుకోండి: