ఇది మీ శరీరం సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. సెరోటోనిన్ ఒక ముఖ్యమైన మెదడు రసాయనం. ఇది సహజమైన యాంటీ డిప్రెసెంట్, ఆందోళన, నిద్రలేమి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.పండిన అరటిపండు తాజాదానికంటే తియ్యగా ఉంటుంది. తాజాగా పండిన అరటిపండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.వీటిలో పిండిపదార్థాలు, చక్కెరలు (కార్బోహైడ్రేటులు) ఎక్కువగా ఉంటాయి. ప్రతి 100 గ్రాముల అరటి పండులో 20 గ్రాముల పిండిపదార్థాలు, 1 గ్రాము మాంసకృత్తులు, 0.2 గ్రాముల కొవ్వు పదార్థాలు, 80 కిలోక్యాలరీల శక్తి లాంటివి ఉన్నాయి. అరటిపండు సులభంగా జీర్ణమై మలబద్ధకం రాకుండా కూడా కాపాడుతుంది.మన దేశంలో మొత్తం 50 రకాల అరటిపండ్లు వరకు లభిస్తున్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. అందుకే ప్రతిరోజూ అరటిపండు తినడం వల్ల మీ శరీరానికి 100% కేలరీలు అందుతాయి.కాబట్టి అరటి పండ్లని ప్రతి రోజూ కూడా తినండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి