ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలను తీసుకుని వాటిని బాగా వేడి చేయాలి. ఆ పాలు వేడయ్యాక ఇందులో 3 నుండి 4 పెద్ద పల్లేరు కాయలను తీసుకొని వాటిని పొడిగా చేసుకుని వేయాలి.అయితే ఇవి మాత్రం నాలుగుకు మించి ఉండకుండ చూసుకోవాలి. తరువాత మంటను చిన్నగా చేసి ఈ పాలను మూడు పొంగుల వచ్చే దాకా కూడా బాగా మరిగించాలి. పల్లేరు కాయలు చలువ చేసే గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటాయి. సెగ వ్యాధికి, మూత్రపిండాల సమస్యలకు పల్లేరుకాయలు మంచి ఔషధంలా పని చేస్తాయి. ఇక ఆ పాలు మరిగిన తరువాత వీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. తీపి కోసం ఇందులో పటిక బెల్లాన్ని లేదా తేనెను కలుపుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పాలను ప్రతిరోజూ కూడా ఉదయాన్నే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ పల్లేరు కాయల పొడిని ఎప్పటికప్పుడు కూడా మీరు తాజాగా తయారు చేసుకోవాలి.


ఇలా పాలను వారానికి నాలుగు సార్లు తయారు చేసుకుని తాగడం వల్ల ఖచ్చితంగా మీ కాలేయం శుభ్రపడుతుంది.ఇంకా అలాగే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య కూడా చాలా ఈజీగా తగ్గుతుంది. స్త్రీలు ఈ పాలను తీసుకోవడం వల్ల నెలసరి సమస్యలు ఇంకా గర్భాశయ సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇంకా అలాగే శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో అలాగే గుండె సమస్యలను తొలగించడంలో ఈ పల్లేరు కాయలతో చేసిన పాలు మనకు ఎంతగానో సహాయపడతాయి.ఇంకా అలాగే కంటి సమస్యలను తగ్గించి కంటి చూపును మెరుగుపరచడంలో ఇంకా అలాగే నోటి సమస్యలను తగ్గించడంలో కూడా పల్లేరు కాయలు చాలా బాగా సహాయపడతాయి. ఈ విధంగా పల్లేరు కాయలను ఉపయోగించడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు తగ్గి అవి దరి చేరకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: