మనం మన శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను ఈజీగా బయటకు పంపేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోము. కానీ కిస్మిస్‌లను నానబెట్టిన నీళ్లు ఆ పనిని చాలా ఈజీగా చేస్తాయి. అయితే వీటిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.కిస్మిస్‌లను నానబెట్టిన నీళ్లు మన శరీరాన్ని చాలా శుభ్రంగా చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను చాలా ఈజీగా బయటకు పంపుతాయి. లివర్‌ను కూడా బాగా క్లీన్ చేస్తాయి. కిస్మిస్‌లను నానబెట్టిన నీళ్లు లివర్‌లో జరిగే రసాయనిక ప్రక్రియలను కూడా బాగా వేగవంతం చేస్తాయి. దీంతో లివర్‌లోని మలినాలు చాలా త్వరగా బయటకు వెళ్లిపోతాయి. ఈ నీళ్ళను నాలుగు రోజుల పాటు క్రమం తప్పకుండా తాగడం వల్ల ఖచ్చితంగా జీర్ణశక్తి మెరుగు పడుతుంది. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా బాగా మెరుగు పడుతుంది. జీర్ణ వ్యవస్థ మొత్తం బాగా శుభ్రంగా మారుతుంది. దీంతో జీర్ణ సమస్యలు అనేవి ఉండవు.ఇక కిస్మిస్‌లను నానబెట్టిన నీళ్లను తాగడం వల్ల కొవ్వు ఈజీగా కరుగుతుంది. అధిక బరువు కూడా తగ్గుతారు.


అలాగే గుండె,కిడ్నీల పనితీరు కూడా బాగా మెరుగు పడుతుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీని వల్ల సీజనల్‌గా వచ్చే వ్యాధుల నుంచి చాలా ఈజీగా బయట పడవచ్చు. ఈ నీళ్లు మనకు ఎంతో శక్తిని అందిస్తాయి.అందుకే వీటిని తాగితే ఉత్సాహంగా పనిచేస్తారు.ఖచ్చితంగా చాలా యాక్టివ్‌గా ఉంటారు. బద్దకం సమస్య  ఉండదు.గుప్పెడు కిస్మిస్‌లను తీసుకుని 2 కప్పుల నీళ్లలో వేసి నీళ్లు 1 కప్పు అయ్యే దాకా సన్నని మంటపై మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత స్టవ్‌ను ఆఫ్ చేసి ఆ నీళ్లను రాత్రంతా కూడా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే ఆ కిస్మిస్‌లను తిని ఆ నీళ్లను కూడా తాగాలి. ఇలా ప్రతి రోజూ చేయాలి. క్రమం తప్పకుండా 4 రోజుల పాటు ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం కనిపిస్తుంది. దీని వల్ల లివర్ ఆరోగ్యం కూడా బాగా మెరుగు పడుతుంది.లివర్‌లోని వ్యర్థాలు అన్ని ఈజీగా బయటకు పోతాయి. లివర్ వ్యాధులు రాకుండా కూడా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: