రోజు మొదలు పెట్టడం మొదలు పడుకునే వరకు ఏయే టైం లో ఏయే ఆహారం తీసుకోవాలి అన్నది ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతుంటారు. మన బాడీ తీరుని బట్టి కూడా కొన్ని ఆంక్షలు ఉంటాయి. అయితే ఎలాంటి బాడీ అయినా ఉదయాన్నే పరిగడపున కొన్ని ఆహార అలవాట్లు మానేయాలని అంటున్నారు వైద్య నిపుణులు. ఉదయాన్నే ఎంప్టీ స్టమక్ తో తీసుకునే ఆహారం మీద ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఎటువంటి ఆహారం ఉదయాన్నే ఎంప్టీ స్టమక్ తో తీసుకోకూడదు అన్నది చూస్తే.. ఉదయాన్నే పుల్లటి పదార్ధాలు అసలు తీసుకోకూడదని అంటున్నారు.

పులుపు ఆహారంలో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. అది రిలీజై శరీతంలో ఎసిడిటీ సమస్యలు వచ్చేలా చేస్తాయని చెబుతున్నారు. ఇక పచ్చి కూరగాయలు కూడా ఎక్కువ శాతం తీసుకోకూడదని.. మితంగా తింటే ఓకే కానీ అమితంగా తీసుకోవడం వల్ల కడుపులో నొప్పి.. అజీర్ణ సమస్యలు వస్తాయని అంటున్నారు వైద్య నిపుణులు. ఉదయాన్నే పరిగడుపున శీతల పానియాలు మంచిది కాదని చెబుతున్నారు,

అంతేకాదు ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ చాకెలెట్లు, టీ, కాఫీలు కూడా అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయని.. వీటితో పాటుగా స్పైసీ ఫుడ్ కూడా ఉదయాన్నే తీసుకోకూడదని చెబుతున్నారు. మొత్తానికి ఉదయాన్నే సాత్వికాహారం తీసుకోవడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవడమే కాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని అంటున్నారు. ఫ్రూట్స్ తో పాటుగా జీడి పప్పు, బాదం, పిస్తా లాంటివి తీసుకుంటే శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు ఇస్తుందని అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఎంప్టీ స్టమక్ ఇప్పటివరకు ఏం తీసుకుంటున్నారో చూసుకుని డాక్టర్ల సూచనల మేరకు వాటిని పాటిస్తే అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం చేసే అవకాశం ఉంటుంది.  




మరింత సమాచారం తెలుసుకోండి: