ఈ ఎండాకాలం వేడిలో డీహైడ్రేషన్ కాకుండా ఎన్ని నీళ్లు తాగినా కూడా తక్కువనే చెప్పాలి. చాలా మంది కూడా తరచుగా డీహైడ్రేషన్ కు గురవుతూ ఇతర అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. కాబట్టి వారు ఖచ్చితంగా హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా అవసరం.మన శరీరానికి తగినంత హైడ్రేషన్ లభించాలంటే కేవలం నీరు మాత్రమే తాగితే సరిపోదు. శరీరంలో నీటిని నిల్వ ఉంచే తాజా కూరగాయలు ఇంకా పండ్లు వంటి ఆహారాలు తినాలి.అలాగే శరీరం నుంచి నీటి నష్టం ఎక్కువ జరగకుండా శరీరాన్ని సహజంగా చల్లబరిచే పదార్థాలు ఖచ్చితంగా తీసుకోవాలి.ఇక ఏలకులు, జీలకర్ర, ధనియాలు వంటి సుగంధ దినుసులు శరీరాన్ని చల్లబరిచే గుణాలను కలిగి ఉంటాయి. వీటిని కలిపి చేసే ఇన్ఫ్యూజ్డ్ డ్రింక్స్ తాగటం లేదా సమ్మర్ టీని తాగడం ఈ కాలంలో కచ్చితంగా చేయాలి. ఇది ఖచ్చితంగా మీ శరీరాన్ని చల్లబరుస్తుంది.ఇంకా అంతేగాక వేడి వేడిని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.


ఈ వేసవిలో తాగాల్సిన సమ్మర్ కూల్ టీ రెసిపీని  సులభంగా తయారు చేయవచ్చు, అంతేకాకుండా ఈ టీ తాగటం వలన వేసవిలో సాధారణంగా తలెత్తే ఎసిడిటీ, వికారం, ఉబ్బరం ఇంకా ఆకలి నియంత్రణ వంటి సమస్యల నుంచి ఈజీగా ఉపశమనం లభిస్తుంది. సమ్మర్ కూల్ టీని ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా మీరు నీటిని వేడిచేస్తూ అందులో లవంగాల చూర్ణం, ఏలకులు, ధనియాలు ఇంకా జీలకర్ర వేయండి.ఆ తరువాత ఈ నీటిని ఒక 5 నుంచి 10 నిమిషాలు పాటు మరిగించండి.ఇందులో రుచికోసం కొద్దిగా మిశ్రి లేదా రాక్ షుగర్ ని కలపండి. ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఇక మీ సమ్మర్ కూల్ టీ రెడీ అయిపోయినట్లే. ఆ తరువాత దీనిని కప్పులో వడకట్టి ఒక్కో సిప్ తాగుతూ ఆస్వాదించండి.ఇక ఉదయం నిద్రలేచిన తర్వాత లేదా సాయంత్రం వేళ ఖాళీ కడుపుతో ఈ టీని తీసుకుంటే మీకు ఖచ్చితంగా చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయి.కాబట్టి ఈ టీ తాగండి. ఎండాకాలంలో అనేక వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: