పొట్ట పెరగడానికి పంచదార కూడా కారణమే టీ కాఫీల్లో పంచదారకు బదులు తేనెని వాడడం మంచిది. ఇలా మూడు నెలల పాటు చేస్తే శరీర బరువుతో పాటు పొట్ట కూడా తగ్గిపోతుంది. రోజు ఉదయం కాఫీ లేదా టీ తాగేటప్పుడు అందులో అర టీ స్పూన్ మేర దాల్చిన చెక్కను తీసుకోవడం క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా రక్తంలోని చక్కర స్థాయిని తగ్గించుకోవచ్చు. బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
ఆరోగ్యకరమైన కొవ్వు కూడా శరీరానికి మేలు చేస్తాయి.కాబట్టి స్నాక్స్ సమయంలో వాల్నట్స్, బాదం, వేరుశనగ,వంటివి తీసుకోవడం మంచిది. ఇక సిట్రస్ పండ్లను అధికంగా తీసుకోవాలి. వీటిలో విటమిన్లు అధికంగా ఉంటాయి. కావున శరీరానికి అనవసరమైన కొలెస్ట్రాల్సిని తగ్గిస్తాయి. ఇక కూరగాయల్లో ముఖ్యంగా బ్రోకోలేని తీసుకోవాలి. బ్రోకోలిని వారానికి ఒకసారి తీసుకుంటే పొట్టను తగ్గించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.ఎవరైనా అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఇలాంటి పని చేయడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు.. అయితే ఇలాంటివి చేసేటప్పుడు తమ శరీరానికి ఇలాంటివి పడుతాయో లేదో తెలుసుకొని చేయడం చాలా మంచిది. ఇవే కాకుండా పలు రకాల పద్ధతుల ద్వారా కూడా బరువు తగ్గించుకోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి