సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి చాలామంది కూడా సతమతమవుతూ ఉంటారు. అయితే వర్షాకాలంలో వచ్చే చాలా వ్యాధులను దూరం చేసి మానసిక ఆరోగ్యాన్ని పెంచడంలో మూలికలు చాలా బాగా ఉపయోగపడతాయి.వీటి వల్ల ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు కూడా మీ సొంతం అవుతుంది. చాలా కాలం నుంచి మన భారతీయులు ఆయుర్వేదాన్ని విశ్వసిస్తూ వస్తున్నారు.ఆయుర్వేదం చాలా రకాల రోగాలను నయం చేస్తుందని నమ్ముతారు. అయితే ఇంగ్లీష్ మందులు నయం చేయలేని చాలా సమస్యలని, ఆయుర్వేదం ఈజీగా నయం చేస్తుందని పలువురు అభిప్రాయపడతారు.అయితే సీజనల్ గా వచ్చే చాలా వ్యాధులను దూరం చేసే మానసిక ఆరోగ్యాన్ని పెంచడంలో ఉపయోగపడే మూలికల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఎన్నో యుగాల నుంచి సర్వరోగ నివారణిగా తులసిని పరిగణిస్తారు. దీనిలో ఔషధ గుణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇంకా వీటితో పాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా కలిగి ఉంటాయి.వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ ను తులసి ఆకులు తినడం వలన చాలా ఈజీగా నయం చేసుకోవచ్చు.


ఇక ఈ తులసి ఆకులను నేరుగా తీసుకోవడం, టీ చేసుకుని తీసుకోవడం వలన ఇమ్యూనిటీ పవర్ పెరిగి శ్వాసకోశ సమస్యలనేవి ఈజీగా తగ్గుతాయి. దీనిని దాదాపు 75% దాకా ఆయుర్వేదంలో వాడుతారు.అలాగే వేపలో యాంటీ మెట్రోబయల్, శిలీంద్ర సంహారిణి లక్షణాలు ఉంటాయి.ఇక దీనిని తీసుకోవడం వలన రక్త శుద్ధి జరగడమే కాకుండా బాడీ నుండి టాక్సిన్స్ కూడా ఈజీగా బయటికి వెళ్లిపోతాయి. ఇది మొటిమలు తామర, చర్మ సమస్యలకి కూడా చాలా మంచి ట్రీట్మెంట్ అని చెప్పవచ్చు.అలాగే మంజిష్ట తీసుకోవడం వల్ల కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇంకా అంతేకాకుండా కాలేయం, మూత్రపిండాలు, చర్మాన్ని శుభ్రపరచడంలో కూడా ఈ మూలిక చాలా బాగా సహాయపడుతుంది. ఇది మొటిమలు, ఎలర్జీల నుండి ఉపశమాన్ని కూడా కలిగిస్తుంది.ఇంకా అంతేకాకుండా జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది.ఇక త్రిఫల అనేది కూడా మూడు మూలికల కలయిక. ఇది ఇమ్యూనిటీని పెంచడంతోపాటు జీర్ణక్రియని కూడా మెరుగ్గా చేయడంలో బాగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో కలిపి దీనిని తీసుకోవడం వలన చాలా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: