మనం రెగ్యులర్ గా తినే పండ్లల్లో దానిమ్మ పండ్లు కూడా ఒకటి.ఈ దానిమ్మ పండ్లు తియ్యగా చాలా రుచిగా ఉంటాయి. ఇక వీటిని చాలా మంది కూడా నేరుగా తినడంతో పాటు జ్యూస్ గా చేసుకుని తాగుతూ ఉంటారు.ఈ దానిమ్మ పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అయితే దానిమ్మ గింజలతో పాటు దానిమ్మ చెట్టు ఆకులు కూడా మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఎందుకంటే ఈ దానిమ్మ ఆకుల్లో కూడా ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దానిమ్మ ఆకులతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.దానిమ్మ ఆకుల టీ ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో శుభ్రం చేసిన 6 లేదా 7 దానిమ్మ ఆకులు వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువాత వాటిని తాగాలి. ఇలా తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి సులభంగా పెరుగుతుంది.


ఇంకా అలాగే వాతావరణ మార్పుల  వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా మన దరిచేరకుండా ఉంటాయి.ఈ టీ ని రోజుకు రెండు సార్లు తాగడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ టీని తాగడం వల్ల అధిక బరువు సమస్య నుండి కూడా చాలా ఈజీగా బయటపడవచ్చు. ఇంకా అదే విధంగా దానిమ్మ ఆకుల టీని తాగడం వల్ల ఒత్తిడి కూడా దూరమవుతుంది.అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడే వారు దానిమ్మ ఆకుల టీని తాగడం వల్ల సమస్య దూరమయ్యి హాయిగా నిద్రపడుతుంది.ఇంకా అలాగే నోటిపూత, నోటి సమస్యలతో బాధపడే వారు దానిమ్మ ఆకుల టీని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మి వేయడం వల్ల నోటి పూత తగ్గుతుంది. అలాగే నోట్లో ఉండే క్రిములు, బ్యాక్టీరియా నశించి నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఇంకా నోటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: