అయితే టీ కాఫీని తాగడం శరీరం తేమను చాలా కోల్పోతుందట. ఇది జీవక్రియల పైన పెను ప్రభావాన్ని కూడా చూపిస్తుందట. ఇందులో ఉండే ఆమ్ల లక్షణం శరీరానికి మేలు కంటే కీడుని ఎక్కువగా చేస్తుందని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. అందుచేతనే రెండు గ్లాసులు మంచి నీటిని తాగిన తర్వాతే కాఫీ టీ లను తాగడం మంచిది. కాఫీ టీ లను ఎక్కువగా మరగపెట్టవద్దని మన పెద్దలు చెబుతూ ఉంటారు.. కానీ మరగబెట్టిన వాటి వల్ల కడుపులో ఆమ్లాల స్థాయి పెరిగిపోయి అల్సర్ కు దారి తీసే అవకాశం ఉంటుందట.
కాఫీ టీలతో మరొక ప్రధాన సమస్య కూడా ఉన్నది పళ్ళు గార పట్టడం వంటివి జరుగుతాయి ఇందులో ఉండే టానిన్ అనే రసాయనం అన్నట్టుగా ఇందుకు కారణమన్నట్లుగా కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవాలి అంటే ఉదయం లేవగానే మనం కచ్చితంగా మంచినీటిని తాగడం చాలా మంచిది దీనివల్ల చుట్టూ ఉండే ఒక పొర ఏర్పడి గార పట్టకుండా చూస్తుందట మన శరీరంలో జీవక్రియలను ఉత్తేజింప చేయడంలో కూడా నీటి ప్రాధాన్యత ఎక్కువగానే ఉన్నది శరీరానికి తగినంత మోతాదులో నీరు తీసుకుంటే వైద్యుల దగ్గరికి వెళ్లాల్సిన పని ఉండదని కొంతమంది నిపుణులు సైతం తెలియజేస్తూ ఉన్నారు. మరి ఎవరైనా సరే కాఫీ టీలు తాగే ముందు కచ్చితంగా నీటిని తాగడం మంచిది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి