రోజూ సరిపడా నిద్రపోవడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు.మంచి నిద్ర వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అనేక ఆరోగ్య సమస్యలు ఈజీగా తగ్గుతాయి. శరీరం చాలా గట్టిగా తయారవుతుంది. మంచి నిద్ర వల్ల చాలా రకాల ప్రయోజనాలను మనం పొందవచ్చు. అయితే సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మనం చాలా రకాల సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది. నిద్ర లేమి వల్ల మనం ఖచ్చితంగా ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.ఇక మనం పని చేసేటప్పుడు మన శరీర అవయవాలు కూడా  ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది.అయితే ఇలా అవయవాలు ఎక్కువగా పని చేయడం వల్ల వాటి  శక్తి తగ్గుతుంది. ఈ అవయవాలు తిరిగి పని చేయాలంటే వీటికి విశ్రాంతిని ఇవ్వడం  చాలా అవసరం. అందుకే ప్రతి రోజూ మనం ఖచ్చితంగా 7 నుండి 8 గంటల పాటు నిద్రించడం వల్ల మన శరీర అవయవాలకు తగినంత విశ్రాంతి అనేది లభిస్తుంది. అందువల్ల మనం తిరిగి ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. కానీ మనలో చాలా మంది కూడా రోజూ తగినంతగా నిద్రించడం లేదు.


దీంతో అవయవాలకు తగినంత విశ్రాంతి లభించక చాలా మంది కూడా రోజంతా ఉత్సాహంగా పని చేసుకోలేకపోతున్నారు. అలాగే సరిగ్గా నిద్రించకపోవడం వల్ల కళ్లు ఎర్రబడడం, కళ్లు లోపలికి పోవడం, కళ్లు మూతలు పడడం ఇంకా అలాగే ముఖ కవలికలు మారిపోవడం జరుగుతుంది.ఇంకా మెదడు చురుకుగా పని చేయడం కూడా మానేస్తుంది. అలాగే నీరసం, బలహీనత వంటి సమస్యలు మన దరి చేరతాయి.జీర్ణవ్యవస్థ కూడా చురుకుగా పని చేయడం మానేస్తుంది. హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి.మనం మన ఆహారానికి  ఎంత ప్రాధాన్యత ఇస్తామో నిద్రకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  రోజూ కనీసం ఖచ్చితంగా  8 గంటల పాటు గాఢ నిద్ర పోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రాత్రి పూట గాఢ నిద్ర రావాలంటే  సాయంత్రం 7 గంటల లోపే ఆహారాన్ని తీసుకోవాలి.సాయంత్రం  పండ్లు ఇంకా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల మనం తిన్న ఆహారం చాలా త్వరగా జీర్ణమయ్యి  ప్రశాంతంగా మీకు నిద్రపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: