మనం తినే వంటల్లో ఆవాలను వాడడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుంది. ఇక మనం వంటల్లో వాడే ఆవాలు నలుపు రంగులో ఉంటాయి. అయితే ఈ ఆవాలల్లో మరో రకం కూడా ఉంటాయి. అవే తెల్లని ఆవాలు. అయితే వీటిని మనలో చాలా మంది చూసి ఉండరు. నల్ల ఆవాల లాగే ఈ తెల్ల ఆవాలు కూడా చాలా పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.వీటిని కూడా మనం ఆహారంలో  తీసుకోవచ్చు.ఈ తెల్ల ఆవాలను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మన శరీరంలో ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో కూడా తెల్ల ఆవాలు మనకు సహాయపడతాయి. తెల్ల ఆవాల నుండి తీసిన నూనెను నొప్పులు ఉన్న చోట రాసి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా ఈజీగా నొప్పులు తగ్గుతాయి. ఇంకా అలాగే దగ్గు, గొంతునొప్పి, గొంతులో ఇన్ఫెక్షన్, కఫం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా తెల్ల ఆవాలు మనకు సహాయపడతాయి.


తెల్ల ఆవాల నూనెను గోరు వెచ్చగా చేసి గొంతుపై రాసి నూనె చర్మంలోకి ఇంకేలా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల గొంతు సమస్యలు ఈజీగా తగ్గుతాయి.ఈ తెల్ల ఆవాలల్లో ఫైబర్, ఫ్యాట్స్, బీటా కెరోటీన్, విటమిన్ ఎ, బి1, బి2, బి3, బి6, బి9, సి, ఇ, కె, ఐరన్, మాంగనీస్ వంటి ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. వాటిని ఎక్కువగా చేపల కూరలల్లో, సలాడ్స్, సూప్స్ వంటి వాటితో తెల్ల ఆవాల పొడిని వాడుతూ ఉంటారు. ఈ తెల్ల ఆవాలను ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అజీర్తి సమస్య కూడా తగ్గుతుంది. ఇంకా అలాగే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఇంకా అంతేకాకుండా రక్తపోటును అదపులో ఉంచడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో కూడా తెల్ల ఆవాలు మనకు సహాయపడతాయి. ఇంకా అలాగే తెల్ల ఆవాలను తీసుకోవడం వల్ల కండరాల తిమ్మిర్లు, నరాల బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: