ప్రతి రోజు ఈ డ్రింక్ తాగితే రోజూ ఉండే సిక్ నెస్ ను దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ డ్రింక్ ఇస్తే శరీరం బలంగా, దృఢంగా తయారవుతుంది. ఈ పానియం రోజూ తాగడం వల్ల కంటి సమస్యలు, మతి మరపు, అల్లీమర్స్ కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఇంకా నడుం నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే కండరాలు, నరాలు బలంగా తయారవుతాయి.ఇంకా అలసట, బలహీనత, నీరసం వంటి సమస్యలు తగ్గుతాయి.అందుకే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తో పాటు ఈ డ్రింక్ ని తీసుకుంటే రోజంతా యాక్టీవ్ గా ఉండొచ్చు. ఈ డ్రింక్ తో మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇంకా దీని వల్ల ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ హెల్దీ డ్రింక్ కి కావాల్సిన పదార్థాల విషయానికి వస్తే..అర లీటర్ పాలు, 10 ఖర్జూరాలు, 10 బాదం పప్పులు, 8 జీడి పప్పులు, పటిక బెల్లం ఖచ్చితంగా మీరు తీసుకోవాలి.ఈ డ్రింక్ తయారు చేయు విధానం విషయానికి వస్తే..ముందుగా ఖర్జూర పండ్లలో ఉండే గింజలను తీసేసి.. రాత్రంతా కూడా నీళ్లలో నానబెట్టాలి. ఉదయం పూట బాదం పప్పు, జీడి పప్పులను కచ్చా పచ్చా పౌడర్ గా చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో అర లీటర్ పాలను వేసుకోవాలి. ఇవి ఒక పొంగు వచ్చాక కొద్దిగా పసుపు వేసుకుని కాసేపు మరిగించాలి. ఇక ఆ తర్వాత ఖర్జూరపు పేస్ట్, బాదం, జీడి పప్పు పొడి వేసి కలుపుకోవాలి. తరువాత చిన్న మంట మీద ఈ పాలను మరిగిస్తూ ఉండాలి. ఇంకా మధ్య మధ్యలో ఒక్కొక్క సారి కలుపుతూ ఉండాలి. సరిగ్గా ఒక 10 నిమిషాలు మరిగాక.. స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన హెల్దీ డ్రింక్ రెడీ. వీటిని అలా గోరు వెచ్చగా ఉన్నప్పుడైనా లేదా ఫ్రిజ్ లో పెట్టుకుని కాస్త చల్లగా అయిన తర్వాత తాగినా మంచిదే.

మరింత సమాచారం తెలుసుకోండి: