సాధారణంగా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటుంటారు పెద్దలు.ఎందుకనగా ఇందులో ఉన్న సుగుణాలన్నీ మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి కనుక.ఆ ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ రోజు సైడ్ డిష్ గా వెజ్,నాన్ వెజ్ అంటూ తేడా లేకుండా ఎక్కువ ఎక్కువగా పచ్చి ఉల్లిపాయలు వేసుకుని తింటూ ఉంటారు.కానీ అవగాహన లోపంతో పచ్చి ఉల్లిపాయ అధికంగా తినడంతో కూడా చాలా అనారోగ్య సమస్యలు కొనతెచ్చుకుంటూ ఉన్నామని ఆహార నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.అస్సలు పచ్చి ఉల్లిపాయ అధికంగా ఎందుకు తీసుకోకూడదో, దాని వల్ల కలిగే హాని ఏంటో మనము తెలుసుకుందాం పదండీ..

జీర్ణసమస్యలు..

పచ్చి ఉల్లిపాయల్లో ఫ్రక్టాన్స్ అధికంగా లభించడంతో గ్యాస్,ఉబ్బరం,పొట్ట నొప్పి వంటి జీర్ణ సమస్యలను కలిగించే ఒక రకమైన పిండి పదార్థం.పొట్టలో ప్రకోప ప్రేగు సిండ్రోమ్ లేదా ఇతర జీర్ణ సమస్యలు ఉన్నవారు పచ్చి ఉల్లిపాయలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

రక్తస్త్రావం..

పచ్చి ఉల్లిపాయలలో విటమిన్ కె పుష్కళంగా లభిస్తుంది.విటమిన్ కె రక్తం గడ్డకట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది.కానీ పచ్చి ఉల్లిపాయలను అధికంగా తీసుకోవడంతో అవసరానికి మించి కె విటమిన్ లభించి, రక్త నాలాలో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది.కావున ఆరోగ్యానికి ఎంత మాత్రమూ మంచిది కాదు.  ముఖ్యంగా వార్ఫరిన్ వంటి రక్తం సన్నబడటానికి మందులు తీసుకునే వ్యక్తుల్లో పచ్చి ఉల్లిపాయలు రక్తస్రావం వంటి సమస్యలను అధికం చేస్తుంది.

అలెర్జీ..

కొంతమందికి పచ్చి ఉల్లిపాయలను అధికంగా తినడం వల్ల అలెర్జీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనితో చర్మంపై దురద,దద్దుర్లు,వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.అంతేకాక శ్వాస తీసుకోవడంలో సమస్య వంటి సమస్యలు కూడా వస్తాయి.ఒక వేళ ఉల్లిపాయతో అలెర్జీ వస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది.

నోటి దుర్వాసన..

ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఈ సమ్మేళనమే నోట్లో దుర్వాసనను కలిగిస్తుంది.పచ్చి ఉల్లిపాయల్లో ఘాటైన వాసన వీటిని మీరు తిన్న కూడా నోట్లో నుంచి చెడు వాసన వస్తుంది.

గ్యాస్ సమస్యలు..

ఉల్లిపాయలు అధికంగా ఉన్న ఆసిడిక్ విలువలు పొట్టలో గ్యాస్ కి మూలం అవుతాయి.దీనితో గ్యాస్, ఉబ్బరం,పొట్ట నొప్పి వంటి సమస్యలకు దారితిస్తాయి. కావున ఈసారి ఉల్లిపాయ తినేటప్పుడు జాగ్రత్తగా తక్కువ మోతాదులో తీసుకోవడం చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: