మందారం పూలు..
మందారం పూలను తీసుకొని బాగా దంచి,తలకు పట్టించుకున్న సరే,జుట్టు ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది.జుట్టుకు కావాల్సిన మాయిశ్చరైజర్ ని కూడా అందించడంలో మందార పువ్వు ముందుంటుంది.కొబ్బరి నూనెలో వేసి బాగా వేడి చేసి వడకట్టుకొని స్నానం చేయడానికి అరగంట ముందు అప్లై చేసుకొని,ఆ తర్వాత తన స్నానం చేయడం వల్ల కూడా జుట్టు ఒత్తుగా,బారుగా,నల్లగా పెరుగుతుంది.
బంతిపూలు..
సాధారణంగా దేవుడికి సమర్పించడానికి బంతిపూలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.అదే బంతిపూలను కొబ్బరి నూనెలో వేసి,బాగా మరిగించి కలర్ మారిన తర్వాత గాజు సీసాలో భద్రపరచుకుని,తరచూ ఉపయోగించడం వల్ల కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
మల్లెపూలు..
వేసవి మొదలైంది అంటే చాలు మల్లెపూలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి.వీటిని తలలో పెట్టుకోవడం అంటే మహిళలకు భలే ఇష్టం.అంతేకాక అందాన్ని పెంచుతుంది కూడా.ఇదే మల్లెపూలను కొబ్బరి నూనెలో వేసి మరిగించి జుట్టుకు అప్లై చేయడంతో ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జుట్టు ఒత్తుగా పెరగడానికి దోహదపడతాయి.
గులాబీ పూలు..
రోజ్ ఫ్లవర్ జుట్టుకు ఎన్నో రకాల మేలును కలగచేస్తుంది. మొదట ఇది యాంటీ బాక్టీరియల్ ,రెండవది మీ జుట్టును మెరిసేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది.దీనికోసం ముందుగా ఒక గిన్నె నూనె తీసుకొని,అందులో కొన్ని గులాబీ రేకులను వేయాలి.దీన్ని కొద్దిగా వేడి చేసి జుట్టుకు పట్టించాలి.ఇలా చేయడం వల్ల జుట్టు వుడడం తగ్గి,ఒత్తుగా పెరుగుతుంది.
బృంగరాజ్ పూలు..
ఈ పూలు జుట్టుకు అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఈ పువ్వులతో ఆముదం కలిపి రాత్రంతా నిలువ ఉంచాలి. మరుసటి రోజున ఈ నూనెతో జుట్టుకు మసాజ్ చేయడంతో,ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. అంతే కాక స్కాల్ప్ ఇన్ఫెక్షన్లు,చుండ్రుని తగ్గిస్తుంది.జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది కూడా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి