చలికాలంలో అతిగా చల్లగా ఉండడం వల్ల మనలోని వేడి బయటకు వెదజల్లి చర్మం బ్రేకౌట్స్ అవుతూ ఉంటాయి.ఇలా కాకుండా ఉండాలి అంటే,చలికి ఎక్కువగా చర్మం ఎక్స్పోజ్ కాకుండా బయటికి వెళ్లినప్పుడు స్కార్ప్ వంటిది ధరించడం మరియు మాయిశ్చరైజర్ రాయడం వంటివి కచ్చితంగా చేయాలి. ముఖ్యంగా విటమిన్ ఈ అధికంగా ఉన్న మాయిశ్చరైసర్స్ ని వాడడమే చాలా ఉత్తమం.పెదవులకు లిప్ బామ్ వంటివి కచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది.
మరియు చలికాలంలో అంతగా దాహం వేయదు కానీ శరీరం కాకుండా కచ్చితంగా సరైన మోతాదులో నీటిని తీసుకోవడం చాలా ముఖ్యం.దీనివల్ల కూడా పెదవులు న్యాచురల్ గా డిహైడ్రెట్ కాకుండా ఉంటాయి.
వీటితోపాటు పెదవులు ఇంట్లో ఉండాలి అంటే అందంగా ఉండాలి అంటే కొన్ని చిట్కాలు తప్పనిసరి.అందులో ముఖ్యంగా కలబంద గుజ్జు తీసుకొని,అందులో అర స్పూన్ చక్కర,అర స్పూన్ టమాటా గుజ్జు వేసి, కలపాలి.ఇలా వచ్చిన మిశ్రమాన్ని పొడి పెదాలపై అంటించి, అరగంటసేపు ఆరనివ్వాలి.ఆ తర్వాత మెల్లగా మర్దన చేస్తూ శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేసుకొవాలి.దానితో పెదవులపై ఉన్న మృతకాణాలు తొలిగి,పెదవులు మృదువుగా మారుతాయి.ఇందులో ఉపయోగించిన ఆలోవెరా వల్ల పెదవులు హైడ్రెటెడ్ గా ఉంటాయి.బయటకు వెళ్ళేటప్పుడు కచ్చితంగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి.సరైనా మొతాదులో నీరు తప్పనిసరిగా తీసుకోవాలి.
మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ చిట్కా తప్పక పాటించండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి