పల్లెటూర్లలో ఎక్కువగా లభించేటువంటి కాయలను చీమ చింతకాయలు కూడా ఒకటి.. వీటిని పులిచింతకాయలు అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇవి చూడడానికి జిలేబి టైపులో కనిపిస్తూ ఉంటాయి.. అయితే ఈ వృక్షం ఇంగ్లీష్ వారి నుండి ఇండియాకి అడుగుపెట్టినట్టుగా తెలుస్తోంది.కనుక దీనికి సీమ చింతకాయగా పేరు రావడం జరిగిందట. ఈ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా మాగినప్పుడు గులాబీ రంగు కలర్లో ఎరుపు రంగు కలరర్లో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కాయ పక్వానికి వచ్చినప్పుడు పైన తొక్క కూడా ఊడిపోతూ ఉంటుందట.


అందువలన లోపల ఉండే పండు తీసుకొని తినడానికి చాలా సులువుగా ఉంటుంది. లోపల ఒక్కొక్క కనువులో తెల్లటి గుజ్జు ఉంటుంది. అలాగే నల్లటి విత్తనం కూడా ఉంటుంది. కొద్దిగా తీయగా వగరుగా కూడా ఉంటుంది. ఈ కాయ ఈ చెట్టు ఎక్కువగా ముళ్ళ పొదల లాగా కనిపిస్తూ ఉంటుంది. పట్టణాలలో వారి కంటే గ్రామాలలో ఉన్న వారికి ఈ సీమ చింతకాయల గురించి బాగా తెలుసు ముఖ్యంగా కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ,మహారాష్ట్ర వంటి ప్రాంతాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయట.



నీటి శాతం ఎక్కువగా ఉండటంవల్ల సీమ చింతలో ఎన్నో ఔషధ గుణాలు లభిస్తాయి. ముఖ్యంగా కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ విటమిన్స్ వంటివి ఈ కాయలలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి తింటే ఆరోగ్యానికి సైతం పలు రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయి.సీమ చింతకాయలు చిగుళ్ళు నోటిపూత నివారణకు సైతం ఉపయోగపడుతుందట. వీటి విత్తనాల నుంచి నూనే తీయగా అవి సబ్బుల తయారీలో ఉపయోగిస్తారట.. క్షయ వ్యాధి నివారించడానికి ఈ చెట్టు అడుగు భాగంలో ఉండే వెర్లు  బాగా ఉపయోగపడతాయట. ఈ కాయలలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల పలు రకాల ఉపయోగాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల శరీరంలో అనేక రకాల వైరస్ బారిన పడకుండా చేస్తుంది. గర్భిణీ స్త్రీలకు సీమ చింతకాయలు తగినన్ని పోషకాలను సైతం ఇస్తాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: