చాలా మంది ఎక్కువగా మాంసాహారాన్ని సైతం తినడానికి మక్కువ చూపుతూ ఉంటారు.. అయితే వీటిని ఎక్కువగా తింటే నష్టాలు చాలానే ఉంటాయట .ముఖ్యంగా మటన్ ని ఎక్కువగా తింటే చాలా ప్రమాదమని పలువురు నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.. మటన్ కాషా, మటన్ బిర్యానీ మటన్ కూర్మా ఇతరత్రా వంటకాలను ఎక్కువగా తింటూ ఉంటారు అయితే ఇలా తినేవారు చాలా జాగ్రత్తగా ఉండాలట. ఎందుకంటే మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టూ ముడుతాయట. మాంసంలో ఎక్కువగా ఐరన్ ప్రోటీన్ క్యాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

తక్కువ మోతాదులో తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని ఎక్కువగా తింటే చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజు మటన్ తినడం లేదా వారానికి మూడు రోజుల కంటే ఎక్కువసార్లు తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం అవుతుందట.ఇది శరీరంలో అనేక సంక్లిష్ట వ్యాధులకు సైతం కారణమవుతుందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.. మటన్ ఎక్కువగా తింటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని.. మటన్ లో సమృత కొవ్వు ఎక్కువగా ఉంటుందట.. దీనివల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సైతం విపరీతంగా పెరిగిపోతుంది.

హానికరమైన కొలెస్ట్రాలను ధమనులను పేరుకుపోయి గుండెకు రక్తం సరఫరా కాకుండా చేస్తుంది దీని పలానంగా గుండెకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతాయట.అంతేకాకుండా పక్షవాతం ఇతర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుచేతనే మటన్ ని ఎంత తక్కువలో తింటే అంతే మంచిదట.. బరువు పెరగాలనుకునేవారు నెలలో రెండు మూడు సార్లు తినడం మంచిది ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది చాలా కొవ్వు కూడా కలిగి ఉంటుంది.. టైప్ -2 డయాబెటిస్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట మాంసం రక్తంలో చక్కెర స్థాయిలను కూడా పెంచేలా చేస్తుందని తెలుపుతున్నారు దీనివల్ల ఇన్సులిన్ స్థాయి తగ్గిపోయి క్రమంగా మధుమేహానికి కారణం అవుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: