మిరపకాయలు ఆరోగ్యానికి చాలా మంచివి.ఎందుకంటే ఇమ్యూనిటీని పెంచే మిటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో, ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్యాప్సైసిన్ యాంటీమైక్రోబయల్ లక్షణాలు హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేస్తాయి. ఈ మధ్యకాలంలో గుండె సంబంధిత వ్యాధులతో చాలామంది సమసి పోతున్నారు. ఆహారంలో తగిన కారం లేదా పచ్చి మిరప కాయల్ని యాడ్ చేసుకుంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బీపీని తగ్గించడానికి, రక్తప్రసరణను మెరుగు పరచడానికి క్యాప్సైసిన్ సహాయపడుతుంది. కారంతో కూడిన ఆహారం తీసుకున్నవారు హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ ల బారిన తక్కువగా పడుతున్నారని కొన్ని పరిశోధనలు తెలిపాయి. అంతే కాదు మిరపకాయలు కొలెస్ట్రాల్ లెవల్స్ కంట్రోల్ చేసి హార్ట్ హెల్త్ కు సపోర్ట్ చేస్తాయి. మిరపలో ఉండే క్యాప్సైసిన్ నొప్పి నివారణ లక్షణాలు కలిగి మంచి పేయిన్ కిల్లర్ గా పని చేస్తోంది.


వాపును కూడా తగ్గించే గుణం మిర్చిలో ఉంటే పోషకాలకు ఉంటుంది. కండరాల నొప్పి, అర్థరైటీస్ వంటి వ్యాధులు ఉన్నవారు కాస్త కారంగానే తినాలి. మిర్చి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి ఇవి శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొని దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. విటమిన్ సి, కెరోటినాయిడ్స్ వంటి ఈ యాంటీఆక్సిడెంట్లు బాడీలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ జీవక్రియ రేటును పెంచుతుంది. కారం తినగానే మంటగా అనిపించడానికి ఈ క్యాప్సైసిన్ యే కారణం. కారంగా ఉండే ఆహార పదార్థాలు తింటే అవి మీ శరీరంలోని క్యాలరీస్ కరిగించడానికి సహయపడతాయి. దీంతో మన బరువు నియంత్రణలో ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కేవలం కొంచెం కారం తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మిర్చి తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు, మిటమిన్ సి, క్యాప్సైసిన్ అనే పోషకాలు బాడీలోకి ప్రవేశించి మనం హెల్తీగా ఉండటానికి తోడ్పడతాయి. స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల ఈ రకంగా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: