ఇప్పుడంటే సాయంత్రం స్నాక్స్ అనగానే పిజ్జాలు,బర్గర్లు పానీ పూరీలు,చాట్లు గుర్తొస్తున్నాయి.కానీ పూర్వం రోజుల్లో మాత్రం సాయంత్రం స్నాక్స్ అంటే చాలు మరమరాలు,బొబ్బర్లు,బటానీలు వేయించిన నల్ల శనగలు ఉడకబెట్టిన శనగలను తినేవారు.ఇంకా చెప్పాలి అంటే చాట్ తయారు చేసుకోవడానికి నల్ల శనగల్ని ఉడకబెట్టి,అందులో టమాటాలు,పచ్చిమిరపకాయలు కట్ చేసి,అందులో ఉప్పు నిమ్మరసం కలిపి చాట్ల తయారు చేసుకుని తినేవారు.దీనివల్ల అప్పటికప్పుడు ఆకలి తీరినట్టు అనిపించడంతోపాటు,అవి కలగజేసే ఆరోగ్య ప్రయోజనాలను సైలెంట్ గానే శరీరం ఉపయోగించుకునేది.ఇప్పుడున్న పాశ్చాతపు పోకడల వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పక్కన పెడితే, దుష్ప్రభావాలను ఎక్కువగా కలిగిస్తూ ఉంటుంది.

పూర్వకాలంలో స్నాక్స్ లోని భాగంగానే నల్లశనగలు చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలుగచేస్తాయి.వాటి ప్రయోజనాల గురించి మీరు తెలుసుకుంటే కచ్చితంగా ఇప్పటి నుంచే తినడం మొదలుపెడతారు అవేంటంటే..

వీటిల్లో విటమిన్స్, ఫైబర్, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.రోజూ కాసిన్ని వేయించిన శనగలను తినడంతో సులభంగా జీర్ణం అవడంతో పాటు ఈజీగా బరువు కూడా తగ్గొచ్చు.ఇంకా..

ఇమ్యూనిటీ పెరుగుతుంది..

రోజూ ఓ గుప్పెడు వేయించిన నల్ల శనగలు తినడంతో, ఇందులో ఉన్న విటమిన్స్  రోగ నిరోధక శక్తినీ పెంచుతాయి.దీంతో సీజనల్ వ్యాధులు దరిచేరవు.తరచూ వేయించిన శనగలు తినడంతో జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవు.మరియు మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయి,మలబద్ధక సమస్య కూడా ఉండదు.

బరువు అదుపులో ఉంటుంది..

వేయించిన నల్ల శనగల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.వీటిని రోజుకో గుప్పెడు తింటేనే కడుపు నిండిన భావన కలుగుతుంది.దీంతో ఇవి తిన్న వెంటనే ఏ ఆహారం తీసుకోలేము.

రక్త హీనత ఉండదు:

క్రమం తప్పకుండా తరచూ శనగలు తినడం వల్ల రక్త హీనత సమస్య ఉండదు.ఎందుకంటే వీటిల్లో ఐరన్ అధికంగా లభించి,రక్త హీనత సమస్యలు రాకుండా చేస్తుంది.

గుండె దృఢంగా తయారవుతుంది..

వేయించిన శనగల్లో ప్రోటీన్లు,ఫోలేట్,మెగ్నీషియం అనే పోషకాలు లభిస్తాయి.ఇవి గుండె పనితీరును మెరుగు పరుస్తాయి.అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: