ఎర్ర అరటిపండ్లలో పోషకాలు చాలా పుష్కలంగా లభిస్తాయి. ప్రతి రోజూ  రెడ్‌ బనానా జ్యూస్ తీసుకోవటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రెడ్ బనానా  తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ, వేసవిలో దీని జ్యూస్ తాగటం వల్ల లాభాలు కలుగుతాయంటున్నారు. ఈ జ్యూస్‌ రుచి అద్భుతంగా ఉండడంతో పాటు శరీరానికి కూడా చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే, రెడ్‌ బనానా జ్యూస్‌ని దుకాణాల్లో కొనటం కంటే..మీరు సొంతంగా తయారు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనిలో చక్కెర కలపకుండా తాగడం వల్ల అదనపు ప్రయోజనం ఉంటుంది.ఎర్రటి బనానా జ్యూస్‌ తాగడం వల్ల కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఇది మన అనారోగ్య సమస్యలన్నింటికి చెక్ పెడుతుంది. ముఖ్యంగా డయాబెటిస్‌ రోగులకు చక్కగా పని చేస్తుంది. ఈ పండు కంటి చూపును కూడా మెరుగుపరస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.ఈ ఎర్రటి అరటి పండు ఎసిడిటీని దూరం చేస్తుంది. ఇది కడుపు నొప్పితో పాటు గుండెల్లో మంటను నయం చేస్తుంది. కాబట్టి, మీకు కడుపునొప్పి, గుండెల్లో మంట ఉన్నప్పుడు, రెడ్‌ బనానా జ్యూస్‌ తాగటం చాలా మంచిది.


నారింజలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది సోడియం ఉప్పు ప్రభావాలను వ్యతిరేకిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. అందువలన, ఇది ఛాతీ నొప్పి, స్ట్రోక్, ఇతర గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తక్కువ మొత్తంలో జ్యూస్ తీసుకోవటంతోనే ఇది మీ కడుపు నింపుతుంది.. దీంతో మీరు ఎక్కువ జంక్ ఫుడ్ తినకుండా ఉంటారు.అరటిపండులో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇది ట్రిప్టోఫాన్‌ను సెరోటోనిన్‌గా మారుస్తుంది. సెరోటోనిన్ మిమ్మల్ని సంతోషంగా ఉంచడంలో సహాయపడే అనుభూతిని కలిగించే హార్మోన్. కాబట్టి, ఈ జ్యూస్‌ తాగడం వల్ల మీరు ప్రారంభంలోనే డిప్రెషన్‌ను అధిగమించవచ్చు.రెడ్ బనానాలో ఫ్రక్టోజ్, సుక్రోజ్, గ్లూకోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి మిమ్మల్నీ రోజంతా చురుగ్గా ఉంచేందుకు సహాకరిస్తాయి. అందువల్ల, మీరు జిమ్‌లో మంచి వ్యాయామం చేయవలసి వస్తే, మీరు ముందుగానే ఇలాంటి ఎర్ర బనానా జ్యూస్ తాగవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: