మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం.ఇప్పుడు ఉన్న ఆరోగ్య సమస్యల వల్ల చాలామంది రైస్ ని అవాయిడ్ చేసి ఎక్కువగా సిరి ధాన్యలు చిరు ధాన్యలు తినడం అలావాటు చేసుకుంటున్నారు.నిజానికి ఇవి మన తాత ముత్తాతల కాలంలో బాగా తినేవారు.అందుకే వాళ్ళ దగ్గరకి అనారోగ్యం దరి కాదు.అప్పటివాళ్ళు వీటిని తినడం వల్ల పుష్టిగా బలంగా ఉండేవారు.ఎంత కస్టపడి ఎండలో పొలం పనులు చేసిన అలసిపోయేవాళ్ళు కాదు.అప్పటి కాలంలో సంతానం కూడా ఎక్కువే,కనీసం ఐదుగురు నుండి పది పదిహేను అంతకన్నా ఎక్కువ సంతానం ఉండేది, ఇప్పుడు తింటున్న తిండికి ఒకరిద్దరితో సరిపోతుంది,ఈ తిండి తినటం వల్ల మన తాత ముత్తాతలు వంద నుండి నూటాయాభై సవత్సరములు బ్రతికే వారు.ఇప్పుడు తింటున్న తిండికి అరవై సవత్సరములకె కాలం గడిచిపోతుంది.మరి అప్పటికి ఇప్పటికి ఎంత తేడానో చూసారా.అంతా మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యం.అయితే ఈ చిరు ధాన్యలలో కొర్రలు గురించి వాటిని తినడం వల్ల వచ్చే లాభాల గురించి తెలుసుకుందాం.


కొర్రలు,అండుకొర్రలు,సామాలు,అరికెలు,ఊదలు.ఓరిగలు, మొతం ఆరు రకాలు.కొర్రలు రుచికి కొంచెం వగరుగా ఉంటాయి.దీనిలో కాల్షియం,మాంసకృతులు,ఎక్కువ మొతాదులో ఉంటాయి.వీటిని వండుకొనే ముందు ఐదు గంటలు నానబెట్టుకోవాలి,అరుగుదల తక్కువ,అంత త్వరగా ఆకలి వేయదు.శరీరంలో ఎముకలు బలంగా దృడంగా తయారవుతాయి.కడుపుతో ఉన్నవారికి,పెరిగే పిల్లలకి ఇవి చాలా మంచిది.ఈ కొర్రలలో ఐరన్,మాంగనీష్,మెగ్నీషియం,పుష్కళంగా లభిస్తుంది.పొట్ట సమస్యలు కానీ ప్రేగు సమస్యలు కానీ ఉంటే ఈ కొర్రలు తినడం వల్ల వాటికి చెక్ పెట్టొచ్చు.బరువు తగ్గడం లో సహాయపడుతుంది.షుగరు వ్యాధిని కంట్రోల్ చేస్తుంది.రక్తం హీనతను తగ్గించి కణాలని మెరుగుపరిస్తుంది.ఇలాంటి మరెన్నో మంచి గుణాలు కలిగిన ఈ చిరు ధాన్యం తీసుకోవడం వల్ల నిత్యం యవ్వనంగా ఉంటారు.ఎలాంటి ఆరోగ్య సమస్యలు దగ్గరికి రావు.కనుక చిన్నవారి నుండి పెద్దవారి వరకు వీటిని వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం వల్ల మన ఆయుష్షుని పెంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: