క్యారెట్‌లు ఎక్కువ తిన్నా కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే కొన్ని సహజ చక్కెరలు ఉంటాయి. స్వచ్ఛమైన క్యారెట్ రసంలో చక్కెర తక్కువగా ఉంటుంది. కానీ ప్రాసెస్ చేసిన రసాలలో తరచుగా సువాసన కోసం జోడించిన చక్కెరలు ఉంటాయి. దీనివల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు సమస్యలు తలెత్తుతాయి. అలాగే, చిన్న పిల్లలకు క్యారెట్ ఎక్కువగా పెట్టడం సురక్షితం కాదు, అందువల్ల చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే పిల్లలకు అందివ్వాలి.అలాగే జ్యూస్ చేసేటప్పుడు ఇందులో అత్యంత పోషకమైన ఫైబర్ మొత్తాన్ని కోల్పోతాము. అందువల్ల, క్యారెట్లను జ్యూస్ చేసుకుని తాగడం, తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఒకేలా ఉండవు. అందుకే క్యారెట్ జ్యూస్ తాగే బదులు క్యారెట్ ను సలాడ్ గా లేదా పచ్చిగానే తీసుకోవడం మంచిది.ప్రతి రోజూ క్యారెట్ తినడం అలవాటు చేసుకున్న వారిలో ఇరిటేషన్, నిద్రలేమి, నెర్వెస్ నెస్ మరియు వాటర్ బ్రాష్ వంటి నెగటివ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కుంటారు. క్యారెట్స్ ఎక్కువగా తినడం వల్ల క్యారెట్ లోని బీటా కెరోటిన్, కెరోటినాయిడ్స్ వల్ల చర్మ రంగులో మార్పు వస్తుంది.


ఎల్లో కలర్ నుండి ఆరెంజ్ కలర్ లోకి మారుతుంది. అరచేతులు, ముఖం, చేతులు, పాదాల రంగులో మార్పు కనిపిస్తుంది.జ్యూస్‌ సెంటర్లలో విక్రయించే వారి వద్ద రుచి ప్రధాన అంశం కాబట్టి, కృత్రిమ రుచులను యాడ్‌ చేస్తుంటారు. ఇది క్యారెట్ జ్యూస్ ప్రయోజనాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు.. అన్‌పాశ్చరైజ్డ్ జ్యూస్‌లలో చిన్నపిల్లలకు, గర్భిణీలకు లేదా రోగనిరోధక శక్తి లేనివారికి హాని కలిగించే బ్యాక్టీరియా ఉండవచ్చు.క్యారెట్ జ్యూస్‌ని ప్రాసెస్ చేయడానికి కొన్ని రసాయనాలు వాడుతుంటారు. అలాంటివి ఆరోగ్యకరమైన జ్యూస్‌ ప్రయోజనాన్ని దెబ్బతీస్తాయి. ఎక్కువ సెన్సిటివ్‌గా ఉండేవారిలో స్కిన్ రాషెస్, డయోరియా, అనాఫిలాక్టిక్ రియాక్షన్, హెచ్ఐవిస్, మరియు వాపులు వంటి అలర్జీ రియాక్షన్ ఉన్నవారికి క్యారెట్ అలర్జీని కలిగిస్తుంది. క్యారెట్ లో ఉండే అలర్జెన్స్ వల్ల సెన్సిటివ్ వ్యక్తుల్లో త్వరగా అలర్జీని కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: