అరికాళ్లలో నొప్పి భరించలేనంతగా ఉంటే.. ఒక గుడ్డ తీసుకొని అందులో ఐస్‌ క్యూబ్స్ వేసి అరికాళ్లకు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల వెంటనే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక అరికాళ్ల నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఆక్యుప్రెషర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆక్యుప్రెషర్ కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. కొన్ని రకాల వ్యాయామాలు చేయడం వల్ల కూడా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.మడమలో నొప్పిగా ఉండడం, చీలమండలు గట్టిగా మారడం, మడమ చుట్టూ వాపు రావడం వంటివి కనిపిస్తాయి. పాదాల నొప్పిని తగ్గించడానికి హీట్ ప్యాడ్‌తో మసాజ్ చేసుకోవాలి. మడమలో తీవ్రమైన నొప్పి ఉంటే, హీట్‌ ప్యాడ్‌ను ఉపయోగించాలి. అందుబాటులో హీట్‌ ప్యాడ్‌ అందుబాటులో ఉండకపోతే.. ఒక బాటిల్‌లో వేడీ నీటిని నింపి దాంతో పాదం చుట్టూ మసాజ్‌ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.అరికాళ్లు, చీలమండలు మందంగా మారి అరికాళ్ళ కణజాలం వాపుగా మారితే ఫాసిటిస్‌ సమస్య మొదలవుతుంది. పాదాలపై ఎక్కువ ఒత్తిడి పడితే ఇలాంటి పరిస్థితి వస్తుంది.


అరికాలి ఫాసిటిస్‌కు చాలా రకాల కారణాలు ఉంటాయి. ఎక్కువ సేపు నిలబడి పని చేసే వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అధిక బరువు ఉన్న వారిలో కూడా ఈ సమస్య వస్తుంది. అలాగే ధరించే చెప్పులు, బూట్ల విషయంలో తప్పులు చేసినా అరికాళ్లలో నొప్పి, గాయాలు, పాదాల పగుళ్లు కూడా పాదాలపై ఒత్తిడి పెరగడానికి కారణమవుతుంది.దీనికి పైన పేర్కొన్న టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.ఒకే చోట ఎక్కువసేపు అస్సలు కూర్చొకూడదు. ఎందుకంటే ఎక్కువ సేపు కూర్చోవడం, ఎక్కువ దూరం నడవడం లేదా పరిగెత్తే సందర్భాల్లో అరికాళ్లలో నొప్పి ఎక్కువగా ఉంటుంది.అయితే ఇది మసాజ్‌ చేయడం ద్వారా ఈ నొప్పి నుంచి బయటపడొచ్చు. అయితే ఎన్నిసార్లు మసాజ్‌ చేసినా నొప్పి తగ్గకుండా, పెరుగుతూనే ఉంటే మాత్రం వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. దీనిని చిన్న సమస్యగా భావించి వదిలేయకూడదని హెచ్చరిస్తున్నారు. కాబట్టి సమస్య మరింత తీవ్రంగా మారితే ఖచ్చితంగా డాక్టర్లని సంప్రదించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: