అశ్వగంధ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనివల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెంచగలదు. ఇది మనలో ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది. అంతేకాదు కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. ఇది సంతానోత్పత్తిని పెంచుతుంది.హార్మోన్ల అసాధారణతల లక్షణాలను తగ్గిస్తుంది.అశ్వగంధను తీసుకునే మహిళలు ఆందోళన లక్షణాలను తక్కువగా అనుభవిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి.ఇంకా అశ్వగంధ జీర్ణక్రియను సులభతరం చేయడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. థైరాయిడ్ హార్మోన్లు T3, T4 స్థాయిలను నియంత్రించడం ద్వారా థైరాయిడ్ పనితీరుపై దాని ప్రభావాలను చూపిస్తుంది. అధ్యయనాల ప్రకారం, అశ్వగంధ థైరాయిడ్ గ్రంథి కార్యకలాపాలను ప్రేరేపిస్తుంది. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. ఏకకాలంలో థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ స్థాయిలను తగ్గిస్తుంది.అశ్వగంధ వాడకంతో క్రమంగా మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మన ప్రవర్తనలో సానుకూల మార్పులను తెస్తుంది.


ఈ ఔషధం వివిధ మార్గాల్లో మెదడును ప్రభావితం చేస్తుంది. ఆలోచన, జ్ఞాపకశక్తి, శ్రద్ధను మెరుగుపరచడం, నిద్రను పెంచడం, మన మొత్తం శక్తిని, ఉత్పాదకతను పెంచడం వంటి అనేక మార్గాల్లో మన జీవన నాణ్యతను మార్చే స్థాయికి అశ్వగంధ మనల్ని ప్రభావితం చేస్తుంది.శరీర కొవ్వును తగ్గించడంలో, కండర ద్రవ్యరాశిని పెంచడంలో అశ్వగంధ ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనాలు కనుగొన్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో అశ్వగంధ ఉపయోగపడుతుంది. ఒత్తిడితో పాటు, అశ్వగంధ ఆందోళనను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఆందోళన కూడా ప్రస్తుత కాలంలో చాలా మంది జీవితాలను పీడిస్తున్న విలన్. ఒత్తిడికి, ఆందోళనకు ప్రధాన కారణమైన కార్టిసాల్‌ అనే హార్మోన్‌ను తగ్గించడం ద్వారా అశ్వగంధ వాటన్నింటిని పరిష్కరిస్తుంది.ఇది మహిళలకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అశ్వగంధ హార్మోన్లను నియంత్రించడం, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా స్త్రీ సంతానోత్పత్తిని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. గర్భధారణ అవకాశాలను పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: