ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు.. అయితే ఈ సమస్య ఒకప్పుడు వయసు పెరిగిన వారిలో మాత్రమే కనిపించేది కానీ ఇప్పుడు పాతికేళ్లు కూడా నిండని వారిలో కనిపిస్తూ అందరిని భయభ్రాంతులకు గురిచేస్తోంది.. మరి గుండె సంబంధిత సమస్యల ద్వారా అకాల మరణం పొందుతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోందని చెప్పవచ్చు. అయితే చాలా వరకు గుండె సమస్యలకు కారణం.. మారుతున్న జీవనశైలి.. తీసుకుంటున్న ఆహారంలో మార్పులే అని నిపుణులు చెబుతున్నారు. మరి ప్రతిరోజు ఈ పనులు చేస్తే మాత్రం గుండె జబ్బులను జయించవచ్చు అని కూడా నిపుణులు సూచిస్తున్నారు.

ఇకపోతే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడంతో పాటు వ్యాయామం తగ్గడం వంటి కారణాలవల్ల గుండెపోటు వస్తుందని.. రోజు రోజుకి పెరుగుతున్న గుండె సమస్యల నుంచి బయట పడాలంటే జీవనశైలి లో కచ్చితంగా కొన్నిరకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు.. ఇక రోజువారి జీవితంలో మూడు రకాల పనులు చేస్తే గుండె సమస్యలు వచ్చే ప్రమాదం నుంచి బయట పడవచ్చట..

అవేమిటంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో నడక కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి రోజులో కనీసం 30 నిమిషాలు వేగంగా నడవాలని.. వేగంగా నడవడం వల్ల కండరాలు బలంగా మారడమే కాకుండా గుండె రక్తాన్ని పంపు చేసే సామర్థ్యం కూడా పెరుగుతుందని సమాచారం..

అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలను చేయడం అలవాటుగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.. యోగాలో ఒక భాగం అయిన సూర్య నమస్కారం వల్ల మొత్తం 12 రకాల వ్యాయామాలు చేసినట్లు అవుతుంది.. ఉదయాన్నే మీరు కనీసం 20 నిమిషాలు ఈ ఆసనాలు వేయడానికి కేటాయిస్తే.. ఖచ్చితంగా గుండె,  ఊపిరితిత్తులు బలోపేతం అయి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి..

గుండె జబ్బులు రాకుండా ఉండాలి అంటే సైకిల్ తొక్కడాన్ని అలవాటుగా చేసుకోవాలి. వారంలో నాలుగు నుంచి ఐదు రోజులైనా కనీసం రోజుకు 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కడం  అలవాటు చేసుకుంటే గుండె సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: