ఇటీవల కాలంలో మొబైల్ వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా మనిషిని బానిసగా మార్చుకుంటుంది మొబైల్. నేటి రోజులు ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియా యుగంలో బ్రతికేస్తున్న మనిషి.. చివరికి మొబైల్ స్క్రీన్ పైనుంచి తన కళ్ళను పక్కకు మరల్చేందుకు కూడా ఇష్టపడని పరిస్థితి. అంతేకాదు సోషల్ మీడియా కారణంగా అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే కొత్త ప్రపంచాన్ని వెతుక్కుంటున్నాడు మనిషి.


 ఇక ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తున్నా అరచేతిలో మాత్రం తప్పకుండా స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. ఇలా ఒక్క నిమిషం చేతిలో మొబైల్ లేకపోయినా ఏదో కోల్పోయినట్లుగా మనిషి కనిపిస్తూ ఉన్నాడు. అయితే నేటి రోజుల్లో ఇక చిన్న పిల్లలు కూడా ఇలా మొబైల్ కి బానిసలుగా మారిపోతున్నారు.  ఒకప్పుడు పిల్లలు మారం చేస్తే ఏదో ఒకటి చేస్తూ తల్లిదండ్రులు వారికి అన్నం తినిపించడం చేసేవారు. ఇక అల్లరి చేయకుండా మందలించడం చేసేవాడు. కానీ ఇటీవల కాలంలో మొబైల్స్ పిల్లలు చేతికి ఇస్తే ఇక అల్లరి చేయడం కాదు సైలెంట్ గా పిల్లలు ఉంటుండడంతో పేరెంట్స్ అందరు కూడా ఇదే చేయడం చేస్తున్నారు.


 ఇలా ప్రతిరోజు మొబైల్స్ వాడుతున్న పిల్లలు స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎన్నో వీడియో గేమ్స్ కూడా ఆడుతున్నారు  అయితే ఇలా మొబైల్ కి బానిసగా మారిపోయి గేమ్స్ ఆడుతున్న పిల్లలకు భవిష్యత్తులో మానసిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని కెనడా పరిశోధకులు చెప్పుకొచ్చారు.  ఇలా చిన్నప్పుడే మొబైల్ కి బానిసగా మారిన పిల్లలకు.. 23 ఏళ్లు వచ్చేసరికి బ్రహ్మ కలకడం, మతిస్థిమితం కోల్పోవడం లాంటి సమస్యలు వస్తాయట  ముఖ్యంగా టీనేజ్ లో ఈ గేమింగ్ కు అడిక్ట్ అయితే.  ఈ ప్రభావం  మూడు నుంచి ఏడు శాతం వరకు ఎక్కువగా ఉంటుందట. స్మార్ట్ ఫోన్ల వినియోగం తగ్గించుకుంటే పేరెంట్స్ పిల్లల మధ్య ఉన్న బంధం కూడా దెబ్బతినే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: