ఇటీవల కాలంలో ప్రతి మనిషి కూడా ఆహారపు అలవాట్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇంట్లో ఉన్న ఆహారాన్ని తినడం మానేసి ఎక్కడో రెస్టారెంట్ లలో మసాలాలు దట్టించిన ఆహారాన్ని తినడానికి తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు. ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాన్ని తినేందుకు ఏకంగా భారీగా ఖర్చు చేయడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇలా బయట తినే వాటిలో ఐస్ క్రీమ్ కూడా ఒకటి.. ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. కేవలం చిన్నపిల్లలు మాత్రమే ఐస్ క్రీమ్ ఇష్టపడుతూ ఉంటారు అని కొంతమంది పెద్దలు అంటూ ఉంటారు. కానీ పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా దీనిని లాగించేస్తూ ఉంటారు. దారిన వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ఐస్ క్రీమ్ బండి కనిపించింది అంటే చాలు.. అన్ని పనులు పక్కన పెట్టేసి  ఇష్టమైన ఐస్ క్రీమ్ కొనుగోలు చేసి ఇక తినడం చేస్తూ ఉంటారు. అయితే పెద్దలు అయినా కొన్ని కొన్ని సార్లు బిజీగా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తినాలి అనే కోరికను చంపుకుంటారేమో కానీ పిల్లలు మాత్రం ఎక్కడ బండి కనిపించినా ఇక తమకు ఐస్ క్రీమ్ కావాలి అంటూ మారం చేయడం కూడా చూస్తూ ఉంటాం. ఇక ఈ ఎండాకాలంలో అయితే ఇలా ఐస్ క్రీమ్ ఆరగించే వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. మండే ఎండలకు ఈ చల్లటి పదార్థం ఎంతగానో ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా సాధారణం కంటే కాస్త ఎక్కువగానే ఎండాకాలంలో ఐస్ క్రీం తినడం చేస్తూ ఉంటారు. కానీ ఇది ఎంతవరకు ఆరోగ్యానికి మంచిది అనే విషయంపై మాత్రం పెద్దగా ఎవరూ పట్టించుకోరు. అయితే ఐస్ క్రీమ్ లో చెక్కర స్థాయి కాస్త ఎక్కువగా ఉంటుంది. అది చెడు కొలెస్ట్రాల్ గా మారుతుందని.. ఎంతోమంది భయపడుతూ ఉంటారు. ఇలా ఐస్ క్రీమ్ తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందనిభావించి దానికి దూరంగానే అంటూ ఉంటారు. కానీ ఇటీవల హర్వర్డ్ విశ్వవిద్యాలయం వైద్యు విద్యార్థులు మాత్రం ఐస్ క్రీమ్ గురించి ఆసక్తికర విషయాన్ని చెబుతున్నారు. ఐస్ క్రీమ్ ఆరోగ్యానికి హానికరం కాదు అంటూ హార్వర్డ్ విద్యార్థులు చెబుతున్నారు. ఇది కంటిచూపు మెదడు అభివృద్ధికి దోహదపడుతుందని అంటున్నారు. ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల్ని తగ్గిస్తుంది అలాగే బరువు తగ్గే ఛాన్స్ కూడా ఉంది అంటూ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: