అతి నిద్ర ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మీరు 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోతే ఇది సాధారణమైనది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయంగా చెబుతున్నారు.. ఇది నిద్ర రుగ్మత లేదా ఏదైనా ఇతర అనారోగ్య సమస్య కావొచ్చునని అంటున్నారు. డిప్రెషన్, మానసిక సమస్యలు, గుండె అసాధారణ రీతిలో కొట్టుకోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్, క్రానిక్ పెయిన్, స్లీప్ అప్నియా, నిద్రలేమి, హైపోథైరాయిడిజం, డిప్రెషన్ లేదా యాంగ్జయిటీ, కార్డియోవాస్క్యులార్ డిసీజ్ వంటి నిద్ర రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది.8 గంటల కన్నా ఎక్కువ సమయం నిద్రపోయే వారిలో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ముప్పు అధికంగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అతిగా నిద్రపోవటం వల్ల బరువు పెరుగుతారు. తలనొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలు వస్తాయి.


గుండె జబ్బులు, డయాబెటిస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. శరీరం కొవ్వును ఎక్కువగా నిల్వ చేసుకుంటుంది. ఫలితంగా గుండె సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అతిగా నిద్ర పోయే వారిలో డిప్రెషన్‌, తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలు వస్తాయంటున్నారు. అతిగా నిద్రపోయే వారిలో వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపిస్తాయి. అంతేకాదు.. అతిగా నిద్రపోయేవారు విపరీతమైన అలసటను అనుభవిస్తారు. ఏ పనీ చేయబుద్ది కాదు. చిన్న పని చేసినా అలసిపోతుంటారని నిపుణులు చెబుతున్నారు.7-8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. ఇది మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచుతుంది. సరైన నిద్ర అనంతరం మేల్కొన్నప్పుడు, మీరు చాలా రిలాక్స్‌గా ఉంటారు. రోజంతా హాయిగా గడిచిపోతుంది. మీరు మీ పనిని ఎంతో ఉత్సహంగా, సరికొత్త మార్గంలో ప్రారంభించి పూర్తి చేస్తారు. సంపూర్ణ నిద్రతో మర్నాడు అలసట లేకుండా ఉంటారు. నీరసం అస్సలు మీ దరిచేరాదు. కానీ, చాలా తక్కువ సమయం లేదంటే, ఎక్కువ టైమ్‌ నిద్రపోవడం చాలా హానికరం.కాబట్టి అతిగా నిద్రపోవద్దు. కేవలం 7-8 గంటలు మాత్రమే నిద్రపోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: