ప్రస్తుత కాలంలో చాలా మందికి రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. మారుతున్న జీవన విధానం , తీసుకునే ఆహారంలో మార్పులు, పలు కారణాల వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇకపోతే జీవన శైలిలో మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు సైతం సూచిస్తున్నారు. ముఖ్యంగా వేసవికాలం వచ్చిందంటే చాలు చాలామంది విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. కొద్దిసేపు అలా ఎండలో తిరిగి వస్తారో లేదో ఇలా తలనొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి తీవ్రమైన నొప్పి మరింత బాధపెడుతుంది. ఇందులో రోగి తలనొప్పితో పాటు కడుపు సమస్యలు, వాంతులు, వికారం మొదలైన వాటితో బాధపడవచ్చు. ఇక మీరు కూడా తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే పొరపాటున కూడా వీటిని తీసుకోకండి.

చాక్లెట్.. మైగ్రేన్ లేదా తలనొప్పి అధికంగా ఉండి బాధపడేవాళ్లు చాక్లెట్ అస్సలు తినకూడదు. చాక్లెట్లో కెఫిన్ , బీటా ఫెనీలేతైలమైన్ ఉంటాయి. అవి రక్తనాళాలలో ఉద్రిక్తతను కలిగించి, తలనొప్పికి దారితీస్తుంది. కాబట్టి తలనొప్పి అధికంగా ఉండేవారు చాక్లెట్ కి దూరంగా ఉండండి.

కాఫీ.. సాధారణంగా మనకు తలనొప్పి వచ్చిందంటే టీ లేదా కాఫీ తీసుకోవడం చాలా మందికి అలవాటు.. కానీ కాఫీ తాగడం వల్ల  తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని అనుకున్నా ..ఇది సరైన పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు.. కాఫీలో ఉండే కెఫిన్ మెదడు నరాల పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల మెదడులో రక్తప్రసరణ మందగించి మరింత తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుంది.

సిట్రస్ పండ్లు.. తలనొప్పి అధికంగా ఉన్నప్పుడు నారింజ, నిమ్మ, కివి వంటి నిమ్మ జాతి పండ్లను తీసుకోకూడదు. ఇది ఆరోగ్యానికి మంచిదే అయినా మైగ్రేన్ సమస్య ఉన్నప్పుడు తీసుకుంటే సమస్య మరింత ఎక్కువవుతుంది..

ఇక వీటితోపాటు బంగాళదుంప చిప్స్, ఐస్ క్రీమ్, అవకాడో, అత్తిపండ్లు ,ఖర్జూరం, ఎండు ద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ , వెల్లుల్లి,  ఉల్లిపాయలను కూడా తినకూడదు.  ఇవన్నీ కూడా మీకు తలనొప్పిని మరింత ఎక్కువ చేస్తాయి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే తలనొప్పి నుంచి బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: