మనకు దొరికేటువంటి పండ్ల లో సపోటా పండు కూడా ఒకటి. ఈ సపోట ను తినడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణ క్రియను మెరుగుపరచడమే కాకుండా ఎలాంటి పొట్ట నైన తగ్గించే గుణం ఉన్నది. సపోటా పండులో ముఖ్యంగా విటమిన్స్ పొటాషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి .సపోటా పండును రోజుకొకటి ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణ క్రియ కూడా పెరుగు పడుతుంది. శరీరంలో ఉండేటువంటి అదనపు కేలరీలను సైతం కరిగించేలా చేస్తుంది. సపోటాలు కాస్త చెక్కెర గుణం ఎక్కువగానే ఉంటుంది.


సపోటా కాయలో ఉండేటువంటి పోషకాలు జీర్ణా క్రియ క్యాన్సర్ ను అడ్డుకోవడంలో చాలా ఉపయోగపడుతుంది.. సపోటాలు తింటే శరీరానికి గ్లూకోజ్ బాగా లభిస్తుంది. ఇందులో ఉండేటువంటి ఫైబర్ వల్ల మలబద్ధక సమస్యను కూడా పరిష్కరిస్తుంది. సపోటా తినడం వల్ల తరచూ ఆకలి అనేది వేయదట. సపోటాలో ఉండేటువంటి విటమిన్స్ వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే ఎముకలని కూడా బలపరచడానికి సపోటా కాయలు చాలా ఉపయోగపడతాయి.


కిడ్నీలోని రాళ్ళను ఏర్పడకుండా చేయడానికి సపోటా చాలా ఉపయోగపడుతుంది.. జట్టు రాలడం చుండ్రు వంటి సమస్యను కూడా తగ్గించడానికి ఈ సపోటా ఎక్కువగా ఉపయోగపడుతుందట. కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు సపోటాను తినడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. ఇతర పండ్లతో పోలిస్తే సపోటాలో తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల చాలా మేలు జరుగుతుంది. అయితే సపోటా తినడానికి రుచిగా అనిపిస్తుంది. అయితే మధుమేహ వ్యాధి గ్రహస్తులు సైతం ఈ పండుని తినకపోవడమే మంచిదంటూ వైద్యులు సైతం తెలియజేస్తూ ఉంటారు. సపోటాలో ఉండేటువంటి విటమిన్ ఏ వల్ల కంటి సమస్యలను సైతం దూరం చేస్తుందట.


ఎవరైనా నిద్రలేని సమస్యతో ఒత్తిడితో ఇబ్బంది పడేవారు సపోటా జ్యూస్ తాగడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. ప్రతిరోజు ఒక సపోటా తినడం వల్ల స్లిమ్ముగా మారుతారట.

మరింత సమాచారం తెలుసుకోండి: