ఈ సమ్మర్లో బయటకు వెళ్లేటప్పుడు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. సూర్యరశ్మి ఎక్కువగా చర్మానికి తాకడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. కనుక వేసవిలో బయటకు వెళ్లే సమయంలో సన్ స్క్రీన్ లోషన్స్ వాడడం మంచిది. అలాగే తలపై టోపిని ధరించడం కూడా ముఖ్యం. అదే విధంగా వేసవిలో ప్రయాణాలు చేసే సమయంలో ఆహార విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఎక్కువ కారం, నూనె, మసాలాలు లేని ఆహారాన్ని తీసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవాలి.వేసవికాలంలో ఎండ కారణంగా మనకు విపరీతంగా చెమట పడుతూ ఉంటుంది. శరీరంలో ఉండే నీరంతా ఆవిరైపోతూ ఉంటుంది. కనుక మనల్ని మనం ఎప్పుడూ హైడ్రెటెడ్ గా ఉంచుకోవాలి. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. వీలైతే కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ వాటర్, నిమ్మకాయ నీళ్లు వంటి వాటిని తీసుకోవాలి. ఇవి తీసుకోవడం వల్ల శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ తిరిగి శరీరానికి అందుతాయి. నీరసం రాకుండా ఉంటుంది.వేసవి కాలంలో బయటకు వెళ్లినప్పుడు శాఖాహారాన్ని ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయాలి. తగిన ఆహారాన్ని తీసుకోకపోతే కడుపు ఉబ్బరం, అజీర్తి, వాంతులు, విరోచనాలు వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.


అలాగే ప్రయాణ సమయంలో శరీరానికి తగిన విశ్రాంతి ఉండేలా చూసుకోవాలి. రోజంతా తిరిగినా రాత్రి చక్కగా నిద్రపోవాలి. దీంతో నీరసం, బలహీనత వంటివి దరి చేరకుండా ఉంటాయి. అలాగే మనం తీసుకునే ఆహారం, నీటి విషయంలో కూడా జాగ్రత్త పడాలి. శుభ్రమైన నీటిని తాగాలి. మనం ఆహారం తీసుకునే చోట పరిశుభ్రంగా ఉందా లేదా గమనించాలి. దాహం వేస్తుంది కదా అని అపరిశుభ్రమైన నీటిని తాగితే వాంతులు, నీళ్ల విరోచనాలు అయ్యే అవకాశం ఉంది.వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. సూర్యరశ్మి ఎక్కువగా చర్మానికి తాకడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. కనుక వేసవిలో బయటకు వెళ్లే సమయంలో సన్ స్క్రీన్ లోషన్స్ వాడడం మంచిది. అలాగే తలపై టోపిని ధరించడం కూడా ముఖ్యం. అదే విధంగా వేసవిలో ప్రయాణాలు చేసే సమయంలో ఆహార విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఎక్కువ కారం, నూనె, మసాలాలు లేని ఆహారాన్ని తీసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: