మనలో చాలామంది హై హిల్స్ ధరించడం చాలా స్టైలిష్ గా ఉంటుందని అందాన్ని కూడా పెంచుతుందని భావించి ఎక్కువగా వీటిని వేసుకుంటూ ఉంటారు మహిళలు.. అయితే ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. అందుకు కారణం మన శరీరంలో చాలా చోట్ల నొప్పి అనుభవించాల్సి ఉంటుందట.. చాలామంది వైద్యులు హై హీల్స్ వాడకాన్ని తగ్గించాలని మహిళలకు సూచిస్తూ ఉన్నారు.. హై హీల్స్ ధరించడం వల్ల చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారని అందుకు కారణలు కూడా తెలియజేశారు.


ముఖ్యంగా హై హీల్స్ ని వేసుకున్నప్పుడు బ్యాలెన్స్ చేయలేరని దీనివల్ల వీపులో వాపు, నొప్పి వస్తుందని తెలియజేస్తున్నారు.. హై హీల్స్ ధరించడం అందంగా కనిపించిన.. ముఖ్యంగా మడమలకు అసౌకర్యాన్ని కలిగిస్తాయని.. పాదాలలో నొప్పిని కూడా కలిగిస్తాయని కాలి మడమ వంపు అరికాలి లేదా కాలివేల మధ్య కూడా చాలా ఇబ్బందులు తలెత్తలా చేస్తాయని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. హై హీల్స్ ధరించడం వల్ల వెన్నునొప్పి చాలా తీవ్రంగా వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఎముకల పైన మోకాళ్ళ పైన చాలా ప్రభావాన్ని సైతం చూపిస్తుందట.


ముఖ్యంగా హై హీల్స్ వేసుకోవడం వల్ల మోకాలి కీలు పైన భారీ ఒత్తిడి ఏర్పడుతుందని దీనివల్ల త్వరగా నే మోకాళ్ల నొప్పులకు కూడా దారితీస్తుందని తెలుపుతున్నారు.. అలాగే నడుము, తుంటి చుట్టునొప్పి కలిగేలా చేస్తాయని కీళ్ల నొప్పులు కూడా త్వరగా ఏర్పడతాయని.. అలాగే కండరాలలో నొప్పి కూడా కలుగుతుందని అరికాళ్ళలో మంటలు కూడా కలిగిస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు.. కొన్ని సందర్భాలలో ఈ ప్రెషర్ కి తలనొప్పి కూడా చాలా ఎక్కువగా వస్తుందని తెలియజేస్తున్నారు. కొన్ని గంటల పాటు హై హీల్స్ వేసుకోవడం వల్ల పాదాలు వంకరగా వెళ్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే తీవ్ర ఒత్తిడికి గురై బొటనవేలు స్థానం కూడా మారుతుందని తెలియజేస్తున్నారు. అందుకే హై హీల్స్ వాడడం తగ్గించడమే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: